శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
234. మహాత్రిపురసుందరీ | ||
శ్రీచక్ర మధ్య నున్న బిందువును చుట్టిన త్రికోణ త్రిపుటియే 🔺 మహాత్రిపురసుందరి. అక్కడ నివసించి వున్నది ఆ దేవి. విశేషమైన త్రిపుర స్వరూపము కలిగినటువంటి తల్లీ. తేజేసు కలిగివున్న తల్లికి నమస్కారము 🙏 🌺చేసే పనిలో ఆసక్తి,ఆనందం ,తృప్తి అన్న త్రిపుటి భావాలతో దిగ్విజయాన్ని సాధించగలుగుతాము.🌺 |