శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
230. మహాయాగ క్రమారాధ్యా | ||
బ్రహ్మ అష్టమాతృకల అంశ చేత కలిగిన అరువదినాల్గు మంది యోగినులు ను సేవించుటకు మహాయాగమని అందురు. ఇతర దేవి పూజ ఆరాధన కంటే మహాయాగ ఆరాధన చేత దేవి యొక్క అనుగ్రహమును సత్వరముగా పొందవచ్చును. శ్రీచక్రార్చన సేవయే మహాయాగము. ఈ మహాయాగమే దేవికి చాలా ఇష్టమైనది. ఏ యాగము చేసినా,కరుణ గల తల్లీ కాబట్టి ఆమె అందరికి ఆశీర్వచనాన్ని, తగినంత ఫలాన్ని ఇస్తుంది. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺లక్ష్యాసాధనకొరకు, మనస్సు, బుద్ధి, రెండు ఒక క్రమపద్దతిలో నడిపించే ఏకాగ్రత కలుగుతుంది.🌺 |