శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
289. శృతిసీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా | ||
వేదములు, తలవంచి అమ్మవారి పాదములకడ నమస్కరించినంతనే, అమ్మవారి పాదాబ్జధూళి సింధూరము వలే వాటిశీర్ష పాపిట స్థానమున విరాజిల్లుతున్నది. సకల ఉపనిషత్తులు దేవి యొక్క పాద ధూళి నుండి పుట్టివున్నాయి అన్న భావనతో ఈ నామము చెప్పబడినది. మనిషికి భాహ్య అలంకరము శోభ, ఆనందమును కలిగిస్తుంది,..., అలాగే ఉపనిషత్తుల సారాంశము కూడా ఆనందము, శోభను కలిగిస్తుంది. వేదములు మానవులకు శిరోధార్యములు. వేదములను పట్టిస్తు తల్లియొక్క పాదసేవకు మించిన జ్ఞానము మరియొక్కటి వుండదు. వేదములు అనగా గాయత్రీ వేదమాత. అట్టి ఆ వేదమాతకు నమస్కారము 🙏. 🌺గాయత్రీ వేదమాత యొక్క సేవ, వాటి ఫలితములు ఎప్పుడు సతఫలితాలే అవుతాయి.🌺 |