శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
275. భానుమండల మధ్యస్థా | ||
సూర్యమండలము మధ్య వున్నది. సూర్య కాంతియే పరాశక్తి. సూర్యునియొక్క కాంతిలో గాయత్రీ స్వరూపము దాగివున్నది. అందుకనే ప్రతః సమయమున సంధ్యావందనము, సూర్య నమస్కారములు చెయ్యాలి. గాయత్రీ మాతను ధ్యానము చేస్తే అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహము మనకి లభిస్తుంది. భానుమండలములో ఎర్రటి వస్త్రాములు ధరించి వున్న మహాత్రిపురసుందరిని ధ్యానిస్తే, నిష్కములకు ఆత్మ దరిశనము కలుగుతుంది. సూర్యమండల మధ్యభాగమున ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము 🙏 🌺సూర్యుడు ఉదయించడం, అటులనే అస్తమించడం ఎలాగైతే క్రమపద్దతి పాటిస్తాడో అలాగే మన నిజ జీవితములో క్రమంపద్దతికి అలవాటు పడుతాము తత్తద్వారా మనలో చైతన్య శక్తి సంపూర్ణముగా వుంటుంది.🌺 |