శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
208. మహేశ్వరీ | ||
మంత్రేశ్వరీయేమహేశ్వరీ. మంత్రరూపము లో వున్న నాద స్వరూపిణియే మహేశ్వరీ. సర్వ చైతన్య స్వరూపిణి. మహేశ్వరుడి శక్తిస్వరూపిణి. శివునియుక్క అంతర్ శక్తిగా వున్నది. ప్రణవము త్రిగుణాత్మకము. మహేశ్వరుడు త్రిగుణాత్మకుడు. అతని పత్నిగా నిర్గుణమైనదే మహేశ్వరీ. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనలో వుండే అంతర్ శక్తిని ఆ శక్తి స్వరూపముగా భావించి, మనము చేసే ప్రతి పని ఆ తల్లికి అంకితం చేస్తాము. పరమేశ్వరార్పనమస్తు 🙏🌺 |