సృష్టి స్థితి, లయ తిరోధాన వనములకు కారకులు,.. బ్రహ్మ, విష్ణు,రుద్ర, ఈశ్వర, సదాశివులు.
వారిని పంచాబ్రాహ్మలు అందురు.
అదియే దుష్ట సంహార సమయమున వారు శక్తిహినూలై పంచప్రేతములని అందురు.
బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు ,లలితా పరబట్టారికాయొక్క మంచమునకు కొడులుగా,మరియు సదాశివులు శయ్యగా వుందురు. వారిపై జగజ్జనని అధిసించి, వారికి శక్తినిచ్చును.
వీరిచే నిర్మించబడిన ఆసనము పై శ్రీ లలితా పరమేశ్వరి, ఆ జగజ్జనని ఆశీనురాలై వున్నది అని ఈ నామము యొక్క విశ్లేషణ. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏
🌺పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశానికి ప్రకృతే మూలం. ఈ ఐదింటిలోనే (మానవులతో కలిపి) సకల చరాచరసృష్టి ఇమిడి ఉంది.
ప్రకృతి యొక్క ఆత్మయే పురుషుడు. ప్రకృతి, పురుషుని సంయోగం వలనే సృష్టిలో జీవం ఉద్భవించింది అన్న సత్యాన్ని గుర్తుచేసుకొని,..
ఈ మానవ శరీరముతో ఎన్ని ధర్మ కార్యాలు చేయగలిగితే అన్ని చేస్తూ, సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగే నేర్పరితనము మనలో కలుగుతుంది🌺
|