శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
265. బ్రహ్మరూపా | ||
అన్నింటికీ మూలకరణమై వున్నది. బ్రహ్మ అంటే పూర్ణము. పూర్ణరూపిణి లలితా పరమేశ్వరి. ఏకమునుండి అనేకమును సృష్టించు మూలకారణ ప్రకృతి ఏదో అదియే బ్రాహ్మరూపా. సృష్టిలో ఆది నించి అంతము వరకు అంటే సృష్టి నించి లయము చేసే ప్రక్రియ అదియే బ్రాహ్మరూపా, పరాభట్టారికా అయిన లలితా. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనలో సంకల్పము కలిగించే శక్తియే సృష్టి తత్వం. ఆ సంకల్పానికి పరిపూర్ణనత వచ్చినప్పుడు, దానినే బ్రాహ్మరూపా అందురు. ఈ అనుభూతి మనకి మనస్సు నిశ్చల, నిర్మల, పవిత్ర భావన తో వున్నపుడు తప్పకుండా కలుగుతుంది.🌺 |