శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
266. గోప్త్రీ | ||
గోపనము అంటే పాలించుట. ఈ సమస్త జగత్తును రక్షించేది. శక్తులకు మూలకరణ స్వరూపిణి. జీవుడిలో వుండే ఇచ్చా , జ్ఞాన , క్రియ ప్రక్రియ లో అదృష్యముగా వుండే శక్తియే గోప్త్రీ. శ్రీచక్రములో వున్న వెలుగే గోప్త్రీ.ఆ వెలుగు మన చక్షువులకు కనిపించనిది. ధ్యాన మార్గములో దారి చూపిస్తుంది ఆ వెలుగు. ఈ చరాచర జగత్తుకు అధిష్టానమైనట్టి తల్లికి నమస్కారము 🙏 🌺చెయ్యవలసిన కార్యమును జరిపేటందుకు, మనకి ప్రేరణ కలిగించ్చి, వెలుగు రూపేణ దారి చూపిస్తుంది.🌺 |