శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
292. పూర్ణా | ||
" సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ " ఈ అనంతమే పూర్ణ. పరిపూర్ణనత్వము కలిగి వున్నది. పరిపూర్ణ స్వభావమును చూపించగల దివ్య శక్తి ఎవరో ఆమెయే పూర్ణ. ఆమె ఎన్ని రూపాలు దాల్చినా, తన పూర్ణ స్వభావము మాత్రం మారదు. పూర్ణత్వము కలిగివున్నటువంటి లలితాపరమేశ్వరియే పూర్ణా. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనము చేసే ప్రతి పని నిజాయతితో చేస్తే, ఆ పనికి పూర్ణత్వం వస్తుంది.🌺 |