శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
229. మహాసనా | ||
శ్రీచక్రమే అమ్మవారి ఆసనము మహాసనా. బింధువు ఆ పరాలలిత యుక్క సింహాసనము అయితే, మిగతా శ్రీచక్రమే మహాసనా. శ్రీచక్ర నాలుగు కోణములు మనో, బుద్ధి, చిత్త, అహంకారముల ద్వారములు. శ్రీచక్ర ఈషాన్య కోణంలో ఈశ్వరుడు, ఆగ్నేయంలో రుద్రుడు , నైఋతి లో విష్ణువు, వాయువ్యంలో మహేశ్వర వుంటారు. పూర్వదిక్కున బ్రాహ్మీ, ఆమెయే ఈశ్వరి. దక్షిణమున రౌద్రి, పశ్చిమమున కౌమారి, ఉత్తరమున వైష్ణవి.. ఈ నాలుగు దిక్కులయందు సమస్త జగత్తు దైవతలందరూ శ్రీచక్రములో వుంటారు. ముప్పదియారు తత్వములు ఆసనముగా వున్న ఆ పరాశక్తి వీరందరికి అధిష్టాత్రి కాబట్టి అమ్మాయే మహాసనా. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మన జీవన ప్రయాణము అంతయూ ధర్మ బద్దంగా నడిపిస్తే, మనకి లభించే స్థానము అత్యున్నత స్థానమే. మన నడవడికను బట్టి ఆ స్థానము మనకు లభిస్తుంది.🌺 |