శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
251. చిన్మయీ | ||
జ్ఞానముతో నిండివున్నది. ఓంకార స్వరూపిణి. సమస్త చేతనా స్వరూపిణి, సర్వ జీవుల యందు ప్రాణశక్తి, క్రియా శక్తి, చలన శక్తియై నిండి వున్నది. సర్వాంతర్యామిని నారాయణి. మానవులకు జాగ్రత, స్వప్న, సుషుప్తి అవస్థలను కలగచేసే పరాశక్తి చిన్మయీ. ధ్యానములో కలిగే అనుభూతియే చిన్మయీ. అట్టి చైతన్య స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము 🙏 🌺సమయానుకూలంగా ఆలోచనలు గుర్తుకు రావడం వంటివి జరుగుతాయి.🌺 |