శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
282. సహస్రశీర్షవదనా | ||
సహస్రమూ అనగా అనంతము, అపరిమితము. శీర్ష అనగా శిరము, వదన అనగా ముఖము. శీరము వున్నచో ముఖము వుండును కదా,.. మరి మరల వదనా ఎందులకు?? అని మనకి సందేహము వస్తుంది. వదనము అనగా ప్రస్ఫూటముగా మాట్లాడుటా అని ఇక్కడ అర్ధం. ఉచ్చారణ దోషాలు లేకుండా ఉచ్చరించుట, నోరు వున్న,.. మాటడ్లలేరు కొందరు. తనకి కావలసినది తినలేరు మరికొందరు,.. ఈ పరమార్ధమును తెలుపుటకై *వదనా* అన్న పదము వాడినారు అని గ్రహించగలరు. దృశ్యముగా కనిపించే కొన్ని చుట్ల, అదృష్యముగా వుండి కొన్ని చోట్ల ఆ పరంజ్యోతి వెలుగొందుతూ వున్నది . ఆమె అనంతము, అపరిమతము .రాగద్వేషములకు అతీతముగా వున్నది. సృష్టిలో వున్న ప్రతి అణువు అనంతములో కలుస్తుంది. కావున ఆమెయే సహస్ర శీర్షవదనా.విరాట స్వరూపము. అనంత జ్ఞానము కలిగి వున్నటువంటిది.ఆ తల్లికి నమస్కారము 🙏 🌺 ఈ నామము శ్రద్ధ భక్తతులతో ఉచ్చరించాలి.సాధకులకు అన్నింటిలోనూ పరమేశ్వరి రూపము కనబడుతుంది .రాగద్వేషములకు దూరంగా వుండటానికి ప్రయత్నం ప్రారంభిస్తాము 🌺 |