అరువది నాలుగు కళలు కలిగి వున్నది.
జగజ్జనని కళా స్వరూపిణి కాబట్టి కళామయి.
కళామయి, ఈoమయి, శ్రీoమయి, క్లింమయి, హ్రిoమయి అన్న నామములు దాగి వున్నాయి ఈ నామములో .
అంటే షాడశి స్వరూపిణి కలామయి అని అర్ధం.
షాడశి స్వరూపిణి అంటే, అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది.
పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమతిథి చాలా ప్రీతిపాత్రమైనది.
ఈ అమ్మవారిని లలిత అని, రాజరాజేశ్వరి, గాయత్రీ, మహాత్రిపురసుందరి అని అంటారు.
ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి, మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. త్రిపుర సుందరి దేవీని ఆరాదించటం వలన బుధ గ్రహ దోషాలు శాంతిస్తాయి.
అట్టి మహిమన్వితమైన తల్లికి నమస్కారము 🙏
🌺మనలో వుండే కళలు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, వాద్యం,... ఇద్యాది...వంటి ఇంకా ఎన్నో దాగి వున్న కళలు వెలికి వస్తాయి. మనలో స్ఫూర్తిని పెంచుతాయి.🌺
|