శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
216. మహాసత్త్వా | ||
విశేషమైనటువంటి సత్వ గుణము, స్వభావము కలిగివున్నది. ఇంకొక అర్ధము ఏమి అనగా సత్వము అంటే బలము. విశేషమైన బలము కలిగివున్నది.. తన నామము జపించినవాళ్ళకి, ప్రత్యేక మైన బలము ప్రసాదిస్తుంది ఆ తల్లీ. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ప్రత్యేకమైన శక్తిని మనలో తేజో రూపములో ప్రకాశీస్తుంది. అవాంతరాలను ఎదురుకొని, దృడంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతాము.🌺 |