అరువది నాలుగు కోట్ల యోగిని గణములచే సేవింపబడునది.
శ్రీచక్రమలో ఒకొక్క ఆవరణములో యేనిమిది యోగిని గణములు నుందురు.
వారు బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, మహాలక్ష్మీ అన్న పేరుగల అష్టయోగినీలు.
మరల ఈ అష్టయోగినీలకు ఒకొక్కరికి యేనిమిది మంది అంగభూత శక్తిలు వుంటాయి. అంటే 8×8=64, ఈ అరువై నాలుగు మందికి ఒకొక్కరికి ఒకొక్క కోటిచొప్పున పరిచారికలు, యోగినీగణము వుంటారు.
అంటే 64కోట్లు .( చతుష్షష్టి కోటి యోగినీ)
శ్రీచక్ర తొమ్మిది ఆవరణములో ఇంత మంది యోగినీగణములు వుంటారు.
అట్టి వారందరిచే సేవలు అందుకునే తల్లీ ఆ లలితా పరా శక్తి. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏
🌺అష్ట యోగినీలు వలే అష్ట గుణాలు తప్పక అందరూ కలిగి వుండాలని సూచించారు శ్రీ ఆది శంకరాచార్యులు వారు.
ఈ గుణాలు మనిషికి మానసిక ప్రశాంతత, సంతోషం కలిగిస్తాయి.
వీటివల్ల కలిగే పుణ్యం వలన అతడికి ఇతోధిక ఫలాలు కలిగి ఉతరోత్తర జన్మలలో కూడా లాభపడుతుంది .
ప్రతి ఒక్కరూ ఇటువంటి గుణాలను పెంపొందించుకుంటే ఈ ప్రపంచమే ఆనంద నందనవనం అవుతుంది. అవి ఏమీ అనగా,..
1.సకల ప్రాణికోటి మీద దయ, 2.ఓర్పు,
3.పరనింద చెయ్యకపోవడం,
4.స్వచ్చత, 5. బద్ధకం లేకుండా వుండటం
6. శుభప్రదంగా మాట్లాడటం ,
7.ఉత్సాహంగా ధర్మబద్ధంగా వుండడం
8. నిర్మోహత్వం
ఈ అష్ట గుణములు కలిగిన వారికి, కోట్ల మంది, వారిని ఆదర్శంగా తీసుకుంటారు. లోకం సుభిక్షముగా వుంటుంది.🌺
|