శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
215. మహామాయా | ||
ప్రాణ రూపములో అతి రహస్యముగా వున్నది. కాంతిరూపములో అతి రహస్యముగా వుండును. ఆ తల్లీ దయ వుంటే ఉపాసించుటకు స్థూల రూపములో మనకి కనపడగలదు. గాయత్రీ స్వరూపముతో ఉపాస్య అనుపాస్య రూపముతో, ఎవ్వరికి కనిపించక, అంతటా తానే నిండియున్నది. మంత్రం బీజం ఉపాస్య ద్వారా ఆ మహామాయా స్వరూపిణి, మాయను తొలగిస్తుంది. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺అహంకార, మమకారాలు తో కూడిన అవిద్యా మాయను తొలగించి, విద్యామాయాకు బద్దులమై మన గమ్యానికి చేరుకుంటాము.🌺 |