ఇందులో గుప్తనామములు
1 మనోరూప 2. ఇక్షుదండ , 3. ఇక్షుకోదండ .
మనోరూపేక్షు కోదండ మనసు అనే చేరుకుగడను విల్లుగా ధరించిన లలితపరమేశ్వరి అని అర్ధం. ఇక్కడ మనస్సే ధనస్సు . అది సంకల్ప్ వికల్పములుకు పుట్టినిల్లు .చేరుకుగడయుక్క కణువులే మనలోని చక్రములు.
1) రక్త సహస్రారం 2 అష్టకోణచక్రము 3.షట్కోణ చక్రము 4.మూలాధారము , 5.స్వాధిష్ఠానము , 6.మణిపురము , 7.అనాహతము , 8.విశుద్చక్రము ,9. లంబిక చక్రము , 10.ఆజ్ఞచక్రము .
ఈ మనోరుపమైన చెరకుగడ అనే ధనుస్సునకు 10 కణుపులు . అష్టకోణం, రక్తసహస్రార , షట్కోణము అవ్యక్త చక్రము . మిగిలినవి వ్యక్త చక్రములు .
దీనినంతా కులమార్గం అంటారు . దానికే మరో పేరు పద్మాటవీ .
ప్రాణదండం , బ్రహ్మదండం అన్న పేరుతో పిలువబడుతుంది మన వెన్నుముక .
మనస్సుయుక్క ప్రవృత్తులను ' "కామసంకల్పో విచికిత్స , అశ్రద్ధ, ధృతి ,అదృతి , శ్రీ: ,హ్రీ:, భీ: ,ఇతి ఏతత్ సమాన ఎవా '" అన్నారు .కామమే మనస్సు యుక్కా సంకల్పము , స్వరూపము . మనస్సు వల్లనే సంకల్పం ఏర్పడుతుంది. ఆ తరువాత విచికిత్స చేస్తుంది . ఆ విచికిత్స లో అశ్రద్ధ వస్తుంది . తరువాత ధృతి , అంటే ధైర్యం . అదృతి అంటే భయము , అధైర్యము . శ్రీ: అంటే కోర్కె సాఫల్యమైతే మనస్సు పొందే ఆనందము . హ్రీ: అంటే అవునా కాదా అని మనస్సు పడే సంకోచ భావన . బీ: అంటే అసలు కాదేమో అన్న మొండి భయము .
ఈ సర్వ భావనా సామాగ్రి అంతా కలిపితే మనస్సు అవుతుంది . అదే ఇక్షు కోదండము . అదే చేరుకుగడగా పోల్చబడింది .ఆ మనస్సు ని పిండితే వచ్చే అనుభూతి చేరుకురసంలాంటిది . అది తాగి సంతృప్తి పడుతఫు జీవుడు.
అందువల్ల అమ్మవారు పంచబాణ సాయికయై మనోరూపేక్షు కోదండము కలదిగా లోకములో ప్రశస్తిని పొందినది
మనోరూపమైన చెరుకు విల్లును ఎడంవైపు ఫై చేతియందు ధరించిన తల్లికి ప్రణామము .🙏
🌺ఈ నామం పారాయణం వల్ల మనలొ కలిగే మనసిక పరివర్తనము🌺
మనస్సుకు చలించే స్వభావం ఉంటుంది . అది మన దృఢ సంకల్పాన్ని బలహీన పరుస్తుంది . ప్రలోభాలకు లోబడకుండా ఉండే చలించని స్థిరత్వాన్ని పొందుతాము. 🙏
|