శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
66. సంపత్కరీ సమారూఢ సింధూరవజ్ర సేవితా | ||
*సంపత్కరీ* : కిరణములనుండే ప్రాణము, నాదము, బిందువు, కళ - అన్నియూ వస్తాయి కాబట్టి దృశ్యాదృశ్యముగా అదియే సృష్టియుక్క సంపద. డానికి మూలకారణమైన జగజ్జనని సంపత్కరీ అని కూడా అంటారు. ఆమె ఇవ్వలేని సంపద ఏదీ లేదు కనుక ఆమె సంపత్కరీ. *ఆరూఢము* : అంటే ఆసనము, ఆధారము. సమస్త జగ్గతునకు నాదమే ఆధారము కాబట్టి ఆ నాదమునకు స్వరూపిణి కాబ్బటి అమ్మవారికి ఆరూఢ అన్న పేరు. *సింధురవ్రజ* : అనగా ఏనుగుల సముదాయము. అమ్మవారి సేనా విశేషము. *సంపత్కరీసేవితా* : గజసేనాధ్యక్ష ఐన సంపత్కరీచేత సేవించబడునది. సంపత్కరీచేత అధిరోహణము చేయబడిన గజసేనచే సేవిత. జగదాంబిక యుక్క అంకుశమునుండి ఉద్భవించినది సంపత్కరీ దేవి. ఆమె అధిరోహించిన గజము పేరు 'రణకోలాహలము'. 'కరి' అన్నది మంత్ర విశేషము. అమ్మవారికి వినాయకి అన్న పేరు దీనినించి వచ్చినది. అంటే మూలాధార త్రికోణములో గణపతి వుంటాడు. గణపతియే ఆది అని రహస్యం. సంపత్కరీదేవి, లలితాదేవి యుక్క గజములకు అధిపతి. సంపత్కరీదేవిచే అదుపులో పెట్టబడిన గజముల సమూహంచే సేవింపబడే తల్లికి నమస్కారము 🙏. 🌺ఈ నామంవల్ల మదగజ్జాన్ని అంకుశంతో నియంత్రించినట్లు మనలోని అహంకారమును, మదము అనే లక్షణాలను సంపత్కరీ అనే శక్తి అంకుశాన్ని ధరించి ఆ గుణములను తొలగించి నిగ్రహాన్ని ఇస్తుంది. మనలో శక్తిని ఉపయోగకరమైన కార్యాలవైపు మళ్ళించుకోగలుగుతాము🌺.🙏 |