శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
12. నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండలా | ||
నిజ అంటే పరదేవత , అరుణ అంటే ఉదయించే సూర్యుడు వంటి ఎర్రటి రంగు .ప్రభ అంటే కిరణాలూ, కాంతి. పుర పరిపూర్ణ గా అన్నిటా నిండివున్నది . మజ్జద్బ్రహ్మాండ అంటే సృష్టి యుక్కా ఉద్భవం ,మండలా సమస్త జీవుల్లో భూమండలం లో వ్యాపంచివుండటమూ అన్నది అర్ధం . సృష్టి సర్వము కేవలం సత్వ గుణమువలనా కాదు ... కేవలం తమోగుణముతోను కాదు . సత్వ , రజస్సేన వుండాలి ,... లేక తమోరజస్సేనా వుండాలి . అపుడే సృష్టి జరుగుతుంది ... రజస్ , రజ:రజస్ అంటే రక్తబిందువే . అందుకే ఆ మహామాయ స్వరూపిణి ఈశ్వరునితో అభేద్యంగా వున్నపుడు రజాదేవి అంటారు .ఈశ్వర్ సంకల్పంగా అభివ్యక్తమైనప్పుడు విరజాదేవి అంటారు . బ్రహ్మాండం అంటేనే బిందు త్రికోణం. కారణం ఈశ్వరుడు ఈశ్వరుడు గానే వుండి తన సంకల్పమును కామము గా, అంటే సృష్టి సంకల్పముగా మార్చుకున్నపుడు అతడు కామేశ్వరి రూప పరమాత్మ , .. అందువల్ల ఈ బ్రహ్మాండమండలము ఆ బ్రహ్మాండానికి మూలా కారణమైనది . కాంతి లేనిదే సృష్టి జరగదు. పరదేవతా యుక్కా కాంతి కిరణములు చేత ఈ సృష్టి ఉద్భవించింది. కాంతికి కాంతియైన ప్రతిఫలనాలు ఎన్ని వచ్చినప్పటికి అవన్నియు ఆ పరంజ్యోతి యుక్కా ప్రభా సమ్మిళితమై వున్నవన్నది రహస్యం . అందు చేత సమస్త సృష్టి అమ్మవారియుక్క నిజప్రభ . అందులో మనందరమూ కూడా అమ్మవారి రూపాలమే. అంతర్ముఖులమై చాతుర్యగక్రమంగా శ్రీచక్రం పూజ చేస్తే " "అహంబ్రహ్మాస్మి" అన్న జ్ఞ్యానోదయం వస్తుంది . ప్రక్రుష్టముగా సర్వము తాను అందు నిండివున్నది , పూర్ణము గా నిండివుండునది అదే .. లలిత మహాభట్టారిక . నేను వున్నాను అనుకున్నపుడు , *"అహమస్మి"* అనుకున్నపుడు ఆ లలిత ఈశ్వరమైనది. ' స:అకామయత బహుశ్యం ప్రజాయేయేతి ' అనగా , లలిత అనబడే ఈశ్వరపదార్థము కంటే పైన ఎవ్వరు లేరు. కాబట్టి నిరీశ్వరా ... అక్కడే లలిత స్వభావం , లలిత తత్త్వం తెలుస్తుంది . నిరీశ్వరా అన్న నామం ద్వారా తన కంటే పైన ఈశ్వరుడు లేడు ... అంటే ఈశ్వరుడి కంటే పైన తాను వున్నది అని అర్ధం. తన ఎర్రని శరీర కాంతితో సమస్త బ్రహ్మాండమండలాలను ప్రకాశింపజేస్తున్న తల్లికి నమస్కారం 🙏 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము.* 🌺 నిత్యం మనలో అనేక సంకల్పాలు కలుగుతూవుటాయి . వాటిని విశ్లేషించుకొని సత్యమైన వాటికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము . ఆ క్రమంలో మనలో ఉతేజం , చైతన్యం తేజస్సు సూర్యకిరణములు వలె ప్రసరిస్తాయి . |