శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
63. కామదాయిని | ||
ఇందులోని కొన్ని గుప్త నామాలు *కాయిని* : ఉపాసకుల సౌకర్యము కొఱకు తనొక యంత్రంమై, మూర్తిగా, నామరూపములను సృష్టించుకున్నది కాబట్టి ఆమెను కాయిని అన్నారు. విగ్రహము, చక్రము, మంత్రము ఈ మూడు అమ్మవారియుక్క కళేబరము, లేదా కాయము. *మయిని* : అన్నిటియందు తానే వున్నది కాబట్టి ఆమె మయిని. మాయమయి, సర్వమయి అంటే అన్నిటియందు తానే వున్న 'సర్వాంతర్యామిని'. ఎవరైతే ఈశ్వరునియందు మనస్సు పెడతారో, వారికి బ్రహ్మలోకప్రాప్తిని, లయప్రాప్తిని ఇస్తుంది, కాబట్టి ఆమె కామదాయిని. అంటే ఈశ్వర కృపను ప్రదేసాదించే తల్లీ. ఆ జగజ్జనని కామకోటి పరదేవత. కామ సంకల్పముల రూపములో జీవులయందుండి తన మాయమయ 'లీలాక్లుప్త బ్రహ్మాండమండల' అన్న నామానికి సార్ధక్యాన్ని కల్పించు కుంటుంది. భక్తుల సకల కోరికలను తీర్చు తల్లికి నమస్కారము 🙏 🌺మనిషి జీవిత పర్యంతము కోరికలతో వుంటాడు. ఆ కోరికలు సత్బుధి, సదాలోచన తో కూడిన కోరికలు కోరుకోమని, మన బుద్ధి ప్రేరేపిస్తుంది. 🌺 |