శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
51. సర్వాభరణ భూషితా | ||
సర్వాభరణము అనుటచేత, భరణ, రవణ, నాద, వమనముచేత భైరవిశ్వరూపము లేదా భైరవము. శ్రీలలితా సహస్రనామంలో అమ్మవారికి మహాభైరవ పూజితా అన్న నామమువున్నది. భూషితా అన్న శబ్దముచేత విశ్వాకుండలినిని ప్రతీకగా భావించవలె. నాగకంట్టాభరణం, సదాశివుని యుక్క కంఠమును అలంకరించినది విశ్వాకుండలిని. ఈశ్వరుని ప్రదమస్వరూపము నాదశరీరము. నాదము నుండి బీజములు వచ్చాయి. ఆ బీజములే మాతృకావర్ణములు. మాతృకావర్ణములు, సర్వసారస్వతములు, శాస్త్రములు అనేవి నాదములైనప్పుడు భాషాభివ్యక్త అవుతుంది. అవి తేజోమయములైనప్పుడు సర్వ వర్ణములు అవుతాయి. సహస్రారాంబుజారుఢా, సర్వవర్ణోపశోభితా అన్నది ఇక్కడ రహస్యం. కావున సహస్రారమే సర్వాభరణ భూషిత. అదియే శ్రీ రాజరాజేశ్వరీ. శ్రీ మహాత్రిపురసుందరి. సమస్త దివ్యాభరణాలతో అలంకరింపబడిన తల్లికి నమసకారము 🙏 🌺 *ఈ నామం వల్ల,* మన ఉనికి నుంచే వెలువడే జ్ఞానకాంతులు, సంస్కార గుణములు , సమర్థతతో కూడిన కిరణాలే మనకు ఆభరణాలుగా భావించాలి. 🌺 |