శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
29. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీవిరాజితా | ||
*అనాకలిత* : ఇంతటి మహత్తు, ఇంతటి పరాశక్తి కలిగిన ఆ మహాతల్లిని మరి ఎవరితోనూ పొలిచలేము. ఆమె నిరీశ్వరి. ఆమెపైన ఇంక ఎవ్వరు లేరు. ఈశ్వరుడు అనేది ఆమెయే. కాబట్టి ఆమె అనాకలిత. *సాదృశ్య* : ప్రతి అణువూ బ్రహ్మం అన్న జ్ఞానము కలిగితే అందరియందు ఓకే జ్యోతి కనిపిస్తుంది. అదే సాదృశ్యమంటే. అనగా ఆమె ప్రతివొక్కరిలోను కనిపిస్తుంది. అట్టి స్థితి, అమ్మవారి యుక్క ఆరాధన శక్తీ ద్వారా వస్తుంది. అందరిలోనూ పరాశక్తి ని చూడడం, సమదృష్టి తో చూడడం అన్నది కేవలం అమ్మ ఉపాసకులకు మాత్రమే సాధ్యం అవుతుంది. *చుబుకశ్రీ* : అంటే నోటికి క్రిందగా ముఖముయుక్క చివరి గడ్డము దగ్గర ఉన్నటువంటిది. దానిలో చిన్న గుంట లాంటిది వస్తే అది అదృష్టమని పెద్దలు అంటారు. అమ్మవారికి అట్టి స్థితి ఉన్నది కాబట్టి ఆమె చుబుకశ్రీ అయినది. *శ్రీవిరాజితా* : శ్రీ అంటే బ్రహ్మ, శ్రీ అంటే ఆత్మ. ఈ రెండుయు తానేయై ప్రకాశించు పరంజ్యోతి ఎవ్వరో ఆమెయే విరాజితా. ఈ నామమును సామాన్య అర్ధం ఏమిటంటే, సరితూగలేని, సరిపోల్చలేని చుబుక సంపద తో విరాజిల్లునట్టిది అని అర్ధం. అట్టి తల్లికి నమస్కారము 🙏 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* 🌺 మన ఆలోచన విధానము మారుతుంది. మనలో పరాశక్తి, ఎదిటివారిలోకూడా పరాశక్తి వున్నది అన్న భావన కలుగుతుంది. తతద్వారా ఒక సమదృష్టి భావన ఏర్పడుతుంది. 🙏 |