శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
96. అకులా | ||
ఆజ్ఞాచక్రము పైనుండి బ్రహ్మశీర్షము వరకు వున్న తేజశ్చక్రములను అకులం అంటారు. ఆజ్ఞాచక్రము క్రింద నుండి వున్న తొమ్మిది చక్రములను కులచక్రములు అంటారు. అకుల అంటే ప్రత్యగాత్మ స్వరూపిణియై, ఆజ్ఞాచక్రము తరువాత బ్రహ్మైవాహమస్మి - బ్రహ్మను నేనైవున్నాను అన్న భావనతో వెళుతుంది కాబట్టి ఆమెకు కులమనబడే ఇడ, పింగళ అనే రెండు నాడులతో ఇక సంబంధం తెగిపోతుంది కాబట్టి అక్కడ నుండి ఆమె అకుల అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ వుంటే దాన్ని కులము అంటారు. అమ్మవారు బ్రహ్మస్వరూపిణి, మాయాస్వరూపిణి రెండు కూడా ఆ కారణంచేత కులమునందు వెళ్లే సుషుమ్నలో వున్న బ్రహ్మణి స్వరూపమే ఆమెయే. ఆ జ్ఞ్యాన స్వరూపిణి ఐన తల్లికి నమస్కారము 🙏 🌺ఈ ప్రకృతి లో తెలుసుకోవాల్సిన మరియు నేర్చుకోవలసినవి చాలా వున్నాయి అన్న దృక్పధం లో చుస్తే, వాటిని సాధనకు పెడితే, దానినే కులము అంటారు అది మొదటి మెట్టు. నేర్చుకోవడం మొదలు పెట్టినపుడు భౌతికమైనవి చాలా అవసరాలు అవుతాయి. క్రమంగా పదార్థంతో అవసరం తిరి పరమార్ధం వైపు ప్రయత్నం సాగుతుంది. తిరిగి మరొక అంశం గురించి లేదా దాని వైపు ఉన్న అంశం గురించి పరిశీలన మొదలవుతుంది. ఆలా నేర్చుకుంటూనే ఉంటాము🌺 |