శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
53. శివా | ||
శివా అన్నది శ్ +ఇవా. అనగా ఉన్నట్లు కనిపించు మాయా అని అర్ధం. శివా అంటే శివుని యుక్క భార్య పార్వతీదేవి అని సరస్వతార్దము. ' శ ' కార 'వ ' కారములు శివరూపము. ' ఇ ' కార 'ఆ ' కార రూపములు శక్తి రూపము . వారి అభేదము వల్ల సృష్టి వున్నది. అభేదము భేదముగా కనిపించటమే మాయా. మాయా అనగా నామరూపములు. దానికి మూలకారణమైన శక్తియే శివా. పరమేశ్వరునికీ శక్తియే, అర్ధాంగీయై, శివునికి అభేదముగా అలరారుతున్న తల్లికి నమస్కారము. 🙏 🌺శివుని యుక్క సంకల్పము ద్వారా ఈ భూమి మీద స్థానాన్ని పొందిన మనం, శుభకరమైన ఉనికిని కలిగి ఉంటాము. మనము మనిషి గా వున్న ఈ స్థానాన్ని సద్వినియోగ పరచుకోవడమే మన ద్యేయంగా తీసుకోని, సత్కర్మములే చేయాలి. మన సమయాన్ని సతసాంగత్యము లో గడపాలి 🌺. 🙏 |