చంపక , అశోక , పున్నాగ సుమసౌరభాన్వితమైన కాంతి కబరి కలది అని అర్ధం
ఇందులోగుప్త నామములు
*కచ* : ఆరు ఆకాశములు అమ్మవారి యుక్క కచ , అంటే కొప్పు , శిరోజసంపద .
*నాగసౌగంధిక* : సౌ అన్న బీజం షోడశీని గుర్తు చేస్తుంది .జగత్ కారణాన్ని గుర్తు చేస్తుంది .ఇక్కడ సౌగంధిక అంటే సువాసనతో కీదినదిని .నాగ అంటే సర్పము . కాంతి ని వేదము నందు సర్ప అంటారు . ఇక్కడ నాగ శబ్దము చేత కాంతి యుక్క ప్రవాహ లక్షణము చెప్పబడుతుంది .
*సత్కచా* : అనగా సత్ అనే బ్రహ్మ పదార్థమును తన యుక్క శిరమునందు ఆలంకిరించు కున్న లలితా పరమేశ్వరి అని అర్ధం .
*అశోకాదిక* : శోకము లేని లక్షణము అశోకము . శోకము అజ్ఞానము చేత , అవిద్య చేత , ద్వైత ప్రవుత్తి చేత , పశుప్రవర్తి చేత , స్వా , పర భేదములు చేత ఏర్పడుతుంది . లలిత పారాయణం చేత జీవులు పొందే శోకాది అరిషట్వర్గములయుక్క భాద నుండి విముక్తులై అశోక స్థితి ని పొందుతారు .
*సకల :* అభివ్యక్తమైన సృష్టి సర్వముయందును కళలు నిండివున్నది కనుక ఆమెను సకల అని పిలవటం సముచితమే . సర్వ వనస్పతులు అమ్మవారి కబరి ఫల భూషితాలే
అంటే అన్ని చెట్లు , ఆకులూ , పుష్పములు అమ్మవారి కబరిని ( కొప్పు )అలంకరించినవే . ఇవి వాటి యుక్క ధన్యత .
ఉపాస్యమైన ఒక విగ్రహాన్ని పెట్టుకొని దానినే అమ్మవారిగా బావించి పూలదండలు పూవులు సమర్పించి పూజ చేస్తాము . అంటే అమ్మవారి యుక్క వనస్పతి స్వరూపమే ఈ చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచ అనేది .
జగన్మాత కేశములు సహజగంధం కలవి . కనుక ఆ కేశ సువాసనను తాను ధరించే చంపకాది పుష్పాలకు అమ్మ అందిస్తోది .
ఆ తల్లి కి నమస్కారము 🙏
🌺 *ఈ నామం వల్ల మనలో* కలిగే *మానసిక పరివర్తనం* 🌺
అపవిత్రతను , శక్తి , ఈ నామం తో కేశముల మొదలు పాదముల వరకు సంతరించుకుంటుంది .
మనకు ఆలోచనలు మొట్టమొదటిగా శిరస్సు నుంచే వస్తాయి కదా . అవి సత్సంకల్పాలు అయి మనకు ,
మన పరిసరాలకు సుగంధాలను వెదజల్లి , ఆ పరిమళ సుగంధాన్ని మనము పొందుతాము . 🙏
|