శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
43. కూర్మ వృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా | ||
*ప్రపదాన్వితా* : పదము అంటే స్థానము అని అర్ధము . పదము అంటే పాదము. ప్రపదము ఈశ్వర పదమొక్కటే. దానితో అన్విత కూడినది అంటే ఈశ్వరుని ప్రతిబింబమే, అది పరాశక్తి. కాబట్టి ఆమె ప్రపదా అన్విత అయినది. *ప్రజయిష్ణు* : జయత్సేన అని అమ్మవారి సేనకు పేరు. ఆమె ఎక్కడకు వెళ్లినా జయించే స్వభావము కలది. కాబట్టి జయిష్ణు అయినది. ప్రజయిష్ణు అంటే ఓటమి ఎరుగనిది. ఆ రీతిగా ఆ తల్లి పేరు లక్ష్మి, జయలక్ష్మి. *కూర్మవృష్ఠ* : మూలాధార స్వపిత కుండలినికుర్మవృష్ఠ అంటారు. అమ్మవారి యుక్క పాదములు కూర్మ (తాబేలు)వృష్ఠము వలే, పైన గుండ్రముగా వుంటుంది. ఆమె కూర్మవృష్ఠ, అదే బ్రహ్మపుచ్చo. సహస్రారము పైనవున్న బ్రహ్మశీర్షము ఐతే, మూలాధారములో వున్నది బ్రహ్మపుచ్చము. అందుకని అమ్మవారి పాదాలు ఉపాస్య పాదములు. ఆ అమ్మవారి పాదములకు శతకోటి వందనములు 🙏🙏🙏. *ఈ నామం వల్ల* మనకి అమ్మవారి సన్నిధి లో వున్నాము అని తృప్తి కలిగి, ఆత్మరక్షణము, ఆత్మ స్థైర్యాన్ని పొందుతాము. ఏ కార్యం తలపెట్టినా జయమే కలుగుతుంది. 🙏జయమ్ము నిశ్చయమ్ము 🙏 |