*కిరి* : కిరి అంటే వరాహమూ. ఈ సమస్త పృథ్విని, వేదములను విష్ణువు వరాహ అవతారము ధరించి ఉద్దరించినాడు.
బ్రహ్మాండపురాణంలో శ్రీచక్రపురము యుక్క వర్ణనము అతి విస్తృతంగా, మనోహరంగా వ్యాసభగవానులు చేసారు. 25 నవరత్న ప్రాకారములు ఉండునని మిగితా అనైక ప్రాకారాలు మధ్యన కదంబ వనమును వుండును.. ., మణిద్వీప మండపంలో చింతామణి గృహము వుండును.
అ చింతామణి గృహములో సహస్రస్ధంభ మంటపంలో పంచబ్రహ్మాసనా లేక పంచప్రేతాసనగా అ తల్లీ లలితాపరాభట్టారిక కూర్చుని వుంటుంది
ఈ నామంలో ఐదు 'ర ' కారములు వున్నాయి. అంటే పంచ అగ్ని బీజములున్నాయి. అస్తి, ప్రియం, భాతి, నామ, రూప. ఈ 'ర ' కారాలు అమ్మవారియుక్క రజోగుణ అంశకు ఈ పంచ బ్రహ్మా కళలను ప్రేరేపించుటకు పనికివచ్చే అగ్ని బీజములు. ఈశ్వర సంకల్పానికి క్రియాశక్తిని ప్రేరణ ఇస్తుంది.
కిరిచక్ర నామక రధమును అధిరోహించి వారాహి లలితా పరమేశ్వరి యుక్క రధమునకు ఎడమవైపున వున్న చక్రము. శ్రీ చక్రము లోని అష్టకోణచక్రమే ఈ కిరిచక్రము.
శ్రీచక్ర అంతర్త్రికోణంలో నైరుతి దిక్కున లేదా నైరుతికోణం లో పూజింపబడే భగమాలిని దేవియే ఈ వారాహి.
పంచమి, దండనాధ, సంకేత, సమయేశ్వరి, సమయసంకేత, వారాహి, పొత్రణి, శివ, వార్తాళి, మహాసేనాని, ఆజ్ఞాచక్రేశ్వరి, అలిందిని వీరు పరమేశ్వరి యుక్క దండనాధలు. వీరిలో వారాహి ప్రధాన దండనాధ.
కిరిచక్ర రధమునెక్కిన 'వారాహి' అనే దండనాధ (సైన్యాధ్యక్షురాలు)చేత సేవింపబడుతున్న తల్లికి నమస్కారము 🙏
🌺ఈ నామంవల్ల మన బుద్దిని విస్మరింపజేసే దుష్టస్వభావాలను మరియు మనని కృంగదీసే బలహీనతలను ఆ వారాహి మాత శక్తి దండనతో పారద్రోలి, మానసిక బలాన్ని ఇస్తుంది. 🌺
|