శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
37. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ | ||
*అరుణ* : ఈశ్వరుని కరుణ్నే ఆరుణ. *అరుణారుణ* :ఉదయచే సూర్యుని ప్రభలతో వెలుగొందునట్టి కాంతి శరీరము కలది. ఆ అరుణ బిందువు మరల అరుణబందువై సృష్టి క్రమాన్ని సాగిస్తున్నది కాబట్టి అరుణారుణ. *కౌసుంభ* : కుమకుమ పువ్వు. కౌసుంభ పుష్పము కూడా అరుణ లక్షణమునే తెలుపుతుంది. *వస్త్ర* : అంటే త్రిపుటిస్వరూపిణి, త్రిపురాస్వరూపిణి *భాస్వత్* : ఎల్లప్పుడు ప్రకాశించుచున్నది. ఈ నమ్మాలో మూడు ' ర ' కారములు, రెండు 'ట ' కారములు, మూడు 'స' కారములు, రెండు' భ ' కారములు, రెండు 'క ' కారములు, మూడు 'త ' కారములు, రెండు 'వ ' కారాములు వున్నాయి. మంత్రసాంఖ్య గా చుస్తే, మొత్తం 38 వర్ణములు స్వరూపము అని తెలుస్తోంది. ఆ 38 వర్ణములే అమ్మవారియుక్క కౌసుంభ వస్త్రం. సామాన్య అర్ధము అమ్మవారియుక్క కటి ప్రదేశము, ఉదయించె సూర్యుని రంగువలె, కుంకుమపువ్వు వంటి రంగువలె ఎర్రటి వస్త్రముతో భాసిల్లుతునది. 🙏 *ఈ నామం వల్ల మనలో* భౌతిక శరీరానికి మధ్య భాగమైన కటి ప్రదేశము ఉత్సాహానికి, జాగ్రదవస్దకు, దృడ సంకల్పానికి, ప్రవిత్రతకు, ప్రశాంతతకు సమన్వయము కుదుర్చుతుంది. కాళ్ళు పరుగెత్తడానికి ప్రయత్నిస్తే మనసు అదుపులో పెడుతుంది. ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది. 🙏 |