*రత్న* : అంటే రత్నాలు అన్నా అర్ధం ఒకటే కాకుండా,..
రత్న, మణి, స్నేహ, రాగ - ఇద్యాది మాటలను మంత్రశస్త్రములో మంత్రబీజములు, రత్నములు, మణులు అని అంటారు. కాబట్టి రత్న శబ్దముచేత సమస్తమైన మాతృకావర్ణములు, సప్తకోటి మహామంత్రములు ఆ తల్లి యుక్క మెడయందు హారముగా అలంకరించి ఉంటాయి అని అర్ధము చేసుకోవలయును.
*చింతాక* : చింతాకము అంటే ఆభరణము.
కానీ,..
ఉపాసకులు ద్వారా చింతాక శబ్దము గురించి మనం తెలుసుకోవలసినది, అమ్మవారు మహామాయాస్వరూపిణి. సృష్టిని, నామరూపమును, జడఁచైతన్యములను ఆవిర్బవింప చేసింది. తామున్నామని, జగ్గతూ వున్నదని, ఈశ్వరుడున్నాడని, సృష్టి వున్నదని భావన చేయటమే ద్వైత ప్రవుత్తి.
అట్టి ద్వైత ప్రవృత్తి చేత ద్వందమునకు అధినులై , కష్ట -సుఖములు యెందు, సుఖఃదుఃఖముల యెందు జీవులు చింతను అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతారు.
ఇది మాయా లక్షణం. దీనికంతటికి తన లీలావిలాసంగా మార్చుకొని,. అచట కూర్చొని ఆనందించేది ఆ జగన్మాత కాబట్టి, చింతాక అన్నారు
దీనిని విలోమంగా చెప్తే చింతాక , కచింతా అవుతుంది.
అంటే బ్రహ్మవిచారములో' క ' అంటే బ్రహ్మ 'చింత ' అంటే విచారము.
మానవుడు మాయను గూర్చి, జగ్గతు ను గూర్చి, తనను గూర్చి ఆలోచిస్తే చింతాకుడు అవుతాడు.
తనయెందు వున్నా ఆత్మపదార్థము అంశ్వరమైనది. అదే పరమాత్మ యుక్క అంశరూపమని, ఈ మిగిలిన శరీరము భాందవ్యములు, జగత్తు నశ్వరమని భావించినవారు బ్రహ్మచింతన చేసినవారౌతారు. అట్టివారిని కచింతా పరుడు అని అనవచ్చు.
కాబట్టి చింతాకులు, అమ్మవారిణి ఉపాసిస్తే, వారు చేసే పూజలు వల్ల కచింతా పరులులౌతారు.
*లోలా* : లొలము అంటే వ్రేలాడునట్టిది.
సృష్టిలోని భూతాకాశమునందు కన్పిస్తున్న గ్రహ, నక్షత్ర, తారక కోటు లన్నీయు , అవ్యక్తమైన నిరాధారమును పట్టుకొని,.. సర్వాధారమును పట్టుకొని,... ఆ జగన్మాత పాదాలను పట్టుకొని,... వ్రేలాడుతూ తమయుక్క మార్గము తప్పకుండా పరిభ్రమిస్తూ వున్నాయి.
అట్టి పరిస్థితిని చేసే తల్లి ఎవరో ఆమె లోల. అదే ఆమె లీల.
*ముక్తాఫల* : మాములుగా ముత్యములు అని అర్ధం. కానీ అమ్మవారి పాదములను నమ్మి పూజ చేసేవారికి ముక్తి అనేది ఫలముగా వస్తుంది. ఆమె ఇస్తుంది కాబట్టి ఆమె ముక్తాఫల.
*గ్రేవేయ* : గ్రేవేయ శబ్దము చేత విశుద్ధచక్రము తెలుస్తుంది. విశుద్ధచక్రమే స్వప్నచక్రము. మానవుడు, చింతనుపొంది కనిపించని భావములు కనిపించినట్లుగా ఆ భాధని తనులో పెట్టుకొని,
ఆ బాధలను పొందుతూ మరల నిద్రావస్థలో స్వప్నముగా వాటిని తిరిగి పొందుతాడు. అంటే భాదని పట్టుకొని వ్రేలాడుతాడు. పరమాత్మ తన భాదను పట్టించుకోవట్లేదు అని అనుకుంటాడు.
*నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;*
*రావే ఈశ్వర; కావవే వరద; సంరక్షింపు*భద్రాత్మకా;*
అని ప్రార్ధన చెయ్యడు. సర్వస్య శరణాగతిమ్ అని వేడుకోడు. 🙏
నా సర్వము నీవై.,. నేను అంటే నువ్వే.,. నా అడుగు నీదే, నా మాట నీదే, అన్నియు నీవై అన్న భావన మనలో కలగాలి.
ఎవరైతే అమ్మవారి యుక్క , మెడ లో బంగారు ఆభరణాలు వెళ్ళాడుతున్నటుగా, బుద్ధి ని స్థిరంగా ఉంచారో , అటు, ఇటు భ్రమిస్తారో,...
వారి ని లోలులు అని అంటారు .
అంటే వారు అమ్మవారి పూర్తి విగ్రహం స్మరించుకుంటూ ధ్యానం చేయలేకపోతారు, మధ్యలో ఆటంకాలు వస్తాయ . వారికీ ఇంకా పరిపక్వత రాలేదు అని తెలుసుకోవాలి. లోలులు అంటే ఇది అర్ధం.
ధ్యానం లో సంపూర్నంగ అమ్మవారి స్థూల విగ్రహని ఉపాసిస్తారో, ఆ పరిపక్వత వస్తుందో, వారికీ మోక్షం అన్న ఫలాన్ని ఇస్తుంది అమ్మ. "లోల ముక్తా ఫలాన్వితా" అంటే ఇది అర్ధం.
ఈ స్థాయి మనము అమ్మవారిని ఉపాసన చేయగా చేయగా, ఫలాన్ని అందుకోగలుగుతాము.
ఈ నామములో అమ్మవారి ఆభరణాలు మన బుద్ధి (mind )అని భావించాలి.
రత్నాలు తో కూడిన బంగారు చింతాకు, ముత్యాల ఆభరణాన్ని ధరించిన మోక్ష ఫలాన్ని ఇచ్చే తల్లికి నమస్కారము 🙏.
🌺 *ఈ నామం వల్ల మనాలో కలిగే* *మానసిక పరివర్తనము* 🌺
అంచల అంచలగా ఆ మాత యుక్క కృప కి యోగ్యులుమై , ఆ మోక్ష ఫలాన్ని అందుకుంటాము 🙏
|