శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
35. లక్ష్యరోమాలతాధార సమున్నేయ మాధ్యమా | ||
*సతాం ఉన్మేయ మాధ్యమా* : సతాం అంతే సాధుపురుషులయందు అని అర్ధం. సత్ పదార్థము ఎదో దానీయుక్క బ్రహ్మవిచారము తెలుసుకున్నవారి నే సత్ పురుషులు, సత్ గురువులు అంటారు. కాబట్టి సతాం అంటే,.. సాధుపురుషులయందు, చతుర్యాగ్ క్రమారాధ్యగా శ్రీవిద్యను ఆశ్రయించినవారియందు., అని అర్ధం ఉన్మేయ మాధ్యమా అంటే ఉన్మేయ భూమికలు. ఉన్మేయ భూమికలు అంటే రక్తసహస్రమునుండి పైదాకా వెళ్లే కుండలిని చేసే మహాప్రస్థానము,. అంటే ఆరోహనక్రమము లేదా సంహారక్రమముగా ఏదైతే వున్నదో దానినే ఉన్మేయ భూమిక అని అంటారు. ఈ ముఖప్రాణమును, ఈ తేజస్సును పైకి తీసుకొని పోగలుగుట. ఆ ఉన్మేయ ఆలా వెళ్ళేటప్పుడు ఒక వైపున ఇడ (ఎడమ నాసగ్రము నందు) మరొక వైపు పింగళ( కుడి నాసాగ్రమున) మధ్యయందు సుషుమ్న (నాసాగ్రమ మధ్యన) కాబట్టి ఇడ, పింగళ మధ్య వున్నా సుషుమ్నను ఆశ్రయించినవారు అనేదే సతాం ఉన్మేయ మాధ్యమా. *లక్ష్యరోమలతా* : సుషుమ్నకు లక్ష్య మంటే తనప్రస్థానమునందు బ్రహ్మకచ్చమునకు వెళ్ళుట. రోమాలతా అంతే కులమార్గంలో పయనించే కుండలిని అని అర్ధం. లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మాధ్యమా అంటే,.. సుషుమ్న నాడిలో వజ్రిణీ, చిత్రిణీ, బ్రహ్మణి అన్న మూడు అంతర్గతనాడులు వున్నాయి. బ్రహ్మనాడిలో సుషుమ్న తేజాస్సు పైకిప్రాకటమే సమున్నేయ మధ్యమ. మధ్యమా శబ్దం చేత ఇడ, పింగళ మధ్యలో ఉండేది సుషుమ్న అని తెలియాలి. ఆధారత అంటే మూలాధారం అని అర్ధం. ఈ భునగరమైన మూలాధారమునుండి శ్రీమన్నాగరమైన బ్రహ్మకచ్చపర్యంతము అవరోధములు లేకుండా ఈ ముఖ్యప్రాణము ప్రయాణముచేసే రహస్యాతిరహస్యార్ధాన్ని ఈ మంత్రము వివరణ చెప్పడం జరిగింది. సామాన్య అర్ధం, సన్నని నడుము సూక్ష్మత తెలియజేస్తుంది. ఈ సూక్ష్మత వల్ల సమస్త చరాచర జగత్తుకు అదర్భుతమై జగజ్జనని ఉన్నదని గూడార్థం. 🙏 🌺 *ఈ నామం వల్ల మనాలో* *పరివర్తనము 🌺* సూక్ష్మాన్ని పరిశీలించే చైతన్య భావ స్ఫూర్తి కలుగుతుంది. స్థూలం గా వుండే సమస్య ను సూక్ష్మగా పరిష్కారము చేసుకోగలుగుతాము 🙏 |