శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
57. చింతామణి గృహాంతస్థా | ||
*చింతామణి* : మహా మాయాస్వరూపిణియే చింతాస్వరూపము. చింతామణి మంత్రము మణిచింతా అని కూడా అనవచ్చు.. మంత్రమును పునశ్చరణ చేయటమే. మరల మరల పలకటం మణిచింతా. మణిచింతా చేయుటచేత జీవికి ధర్మార్ధకామ మోక్షములు నెరవేరుతాయి కాబట్టి, ఆ నెరవేరే సాఫల్యాన్ని చింతామణి అంటారు. అంతే కాక ఓం హ్రీo ఓం అన్న మంత్రము కూడా చింతామణి సంజ్ఞతో వున్నది. అదియే ప్రకృతి గాయత్రీ, బీజగాయత్రీ. *గ్రహాంతస్థా :* సర్వగ్రహములను నియామకము చేసి, నిర్మించి వాటికి తత్వములను ఆపాదించి, తేజస్సును ఇచ్చి, బ్రహ్మాండమునందు సంచారము చేయిస్తున్న ఆ పరాశక్తియే గ్రహాంతస్థా అయినది. సప్తకోటి మహామంత్ర సముదాయమే చింతామణిగృహం. మంత్రస్వరూప పరాదేవికే కామకోటి అని పేరు. మంత్రజాపికి సర్వసాఫల్యములు బసంగినది కాబ్బటి ఆమె చింతామణి. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి మొదలైనవి కోరిన కోర్కెలకు, ఫలితమును బసంగునని పిండితార్ధము. శ్రీచక్ర అంతర త్రికోణమే చింతామణి గృహము. అంతస్థా అంటే బిందుమండలరూపిణి.అదియే " ఓం హ్రీo ఓం " బీజసంపుటితో వున్న మంత్రము. శీర్షకోణములో వుండే యోగిని రూపమే కామేశ్వరి అని అర్ధం. సామాన్య అర్ధం ' చింతామణులచే నిర్మితమైన గృహములో వసించు తల్లికి నమస్కారం' 🙏 🌺గ్రహాలు అన్నిటికి ఆ అమ్మవారే అధిష్టాత్రి, ఈ నామం ఉచ్చారణ వల్ల మన జాతక కుండలిలో ఏవైనా గ్రహదోషాలు, గ్రహస్థితి బాలేకపోయిన, వాటి దోష ప్రభావం మనమీద పడకుండా కాపాడుతుంది. పెద్ద ప్రమాదం జరిగే దెగర చిన్న దెబ్బ తో ఆ గ్రహ దోషాన్ని తొలగిస్తుంది. 🌺🙏 |