శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
84. హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధి | ||
*హరనేత్ర* : శివునియుక్క మూడవ కన్ను అని సామాన్య అర్ధం. మన శరీరములో రుద్రగ్రంధి వుండే చోట అనగా ఆజ్ఞాచక్రమునందు వెలుగు కనిపించుటయే హరనేత్రం. *అగ్ని సందగ్ధ* : అగ్ని చేత కాంతి రూపొందినది అని అర్ధం. దగ్ధ కావటానికి అక్కడ నామరూపముల కంటే అతీతమైన వెలుగు కాబట్టి అగ్ని చేత దహించబడిన కాముడు. *కామ సంజీవనౌషధి* : : మొత్తం శ్రీచక్రమంతా బింధువు దగ్గర నుండి అష్టకోణచక్రము వరకు కామావనము కింద లెక్కపెట్టాలి. అమ్మవారి మంత్రము లన్నియు ప్రారబ్ధములను, రోగములను, కష్టములను, అరిష్టములను అన్నింటిని పోగొట్టజాలిన సామర్ధ్వాంతమైనది, సంజీవని వంటిది. కాబట్టి ఆమె భవరోగమునకు ఔషధము వంటిది. అంటే అందరి యందు అశాంతిని పోగొట్టి శాంతిని ప్రసాదించే జగజ్జనని. బ్రహ్మయుక్క ఉపాస్య, నామ, రూప కళలు దగ్ధమై, మాయాశబలిత లక్షణము భస్మీకృతమై, దగ్ధమై పోయి, జీవుడు అ జగజ్జని యుక్క కృప తో, ఆత్మ దర్శనము అన్న ఔషధము తో సంజీవని అవుతాడు. అంటే బ్రహ్మా యుక్క తత్వమును తెలుసుకుంటాడు. శివుని నేత్రాగ్నిచే బూడిదైన మన్మధుణ్ణి మరల బ్రతికించి, అతని పాలిట సంజీవనిఔషధియైన తల్లీ కి నమస్కారము 🙏. 🌺శుద్ధి చేయబడిన మన్నస్సు తో తిరిగి ఆలోచనలు మొదలు పెడితే, మనలో నూతన ప్రయోజన లక్షణములు ప్రకాశిస్తాయి. ఉత్తమ సంకల్పాలు జనిస్తాయి🌺. |