శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
94. కౌళిని | ||
శివశక్తి సమరస్యమే "కౌళిని " అదియే శ్రీచక్రము.. విరియుక్క సామరస్య స్వరూపమే కౌళిని అని అర్ధం. అట్లే పిండాండమున శివశక్తి స్థానములైన శ్వేత రక్త సహస్రారముల సామరస్యమే కౌళిని. అట్లే నాడులలో ఇడ, పింగళ సామరస్యమే సుషుమ్న. అదియే కౌళిని. అట్లే పంచప్రాణములలో ప్రాణ, అపాన, వ్యాన, సమానములు కులము. ఉదానము -ఆకులము. వారి సామరస్యమే కౌళిని. జాగ్రత, స్పాన, సుషుప్తులు -కులము. తురీయా, తురీయాతీతములు -ఆకులము. వాటి సమాహారమే కౌళినీ. 🌺మనం పద్దతులను తెలుసుకోని ఆచరణలో పెట్టడం అనేది మనలో వుండే వెన్నెముక అనే శక్తి స్తంభం ద్వారా జరుగుతుంది. సకల శరీరముకు, మనస్సు, బుద్దుకి, సంస్కారానికి, నియమబద్ధతకు మూలస్తంభం వెన్నెముక. అదే కౌళిని అనే శక్తి మార్గం ద్వారా మన శరీరములో వున్న ఈ భాగం దృఢ పడుతుంది. అంటే మనలో ఒక ఆత్మ విశ్వసం వస్తుంది 🌺 |