శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
98. సమయాచార తత్పరా | ||
దాహరగుహయందున్న ఆత్మని పూజ చేయటం. అమ్మవారికి బహు ఇష్టమైన విషయము. ఆమె సమయాచార కాబట్టి, సనక, సనందన, సనత్కుమార, సనసుజాతీయ, వశిష్ట ఇత్యాదులందరూ కూడా ఈ సమయాచారరమునకు సంబందించిన బాహ్య అంతర పూజా విశేషాల్ని సుభాగమపంచకము అన్న పేరుతో దీనిని గురించి వ్రాసారు. *పరాచార* : దృక్ దృశ్యమునకు అతీతమైన సర్వభావన సర్వాత్మభావనకు అతీతమైన ధ్యానం బ్రహ్మశీర్షమునందు చేసేది పరాచారం. అట్టి సద్య: పూజకు సద్య:ఫలితాలు ఇస్తుంది ఆ తల్లీ. వారికి తన గుణమును, తన తేజాస్సును అన్నిటినీ ఇస్తుందని పెద్దలు చెప్పారు. దహరపూజయే సమయాచారము,. అదియే ముఖ్యప్రాణ ఉపాసనము. 🌺ఈ నామము ఏకాగ్రతతో పూజిస్తే, మన సమస్య కి సమయానుసారంగా మనకే ఒక మార్గము, ఒక గమ్యము ఏర్పడుతుంది. 🌺 |