శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
42. గూఢగుల్ఫా : | ||
ఈ నామము అమ్మవారి పాద మడమలు గురించి వర్ణించారు. పద్మాసనంలో అమ్మవారి చీలమండులను (కాలి మడమ) కళికా స్థానంలో దాచిపెట్టుకుంది కాబట్టి గూఢగుల్ఫా , అవి మణి పాదుకలు అని అర్ధము. గూఢమైన కాలిచీలమండలు కలది 🙏 *ఈ నామం తో* అమ్మవారిని ధ్యానిస్తే, ధ్యానించే వారందరిని రక్షించే స్వభావము గల తల్లి కాబట్టి, ఈ నామం జపం చేస్తూ మన కాలి మడమును మర్దనా (massage)చేస్తే, మొలలు(piles)వ్యాధి వున్నవారికి చాలా తేలికగా ఉపశమనము కలుగుతుంది 🙏 |