శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
87. శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణి | ||
శక్తికూటములో ఏకత్వాన్ని పొందిన కటి నుండి పాదాంతరము వరకు వున్న దేవియుక్క సూక్ష్మస్వరూపము అన్నది ఇక్కడ చెపుతున్నారు. *కట్యధోభాగ ధారిణి :* నడుము నుండి క్రింద వరకూ గల శక్తికూటమును ధరించి వున్నది అని అర్ధం. *శక్తికూట* : వాక్భవకూటము నామరూపములను సృష్టి చేయవలెనన్న సంకల్పమైతే, కామరాజకూటము నామరూపముల యుక్క సృష్టి లక్షణం. శక్తికూటము వాటినన్నిటినీ చలన - చాలనములు చేసే లక్షణము. పంచదశీ విద్యలో చివరి నాలుగు అక్షరములు 'శక్తికూటము'అంటారు. ఈ యుక్క కూటము శ్రీమాత యుక్క సూక్ష్మత రూపాన్ని సూచిస్తుంది. శక్తికుండలిని, క్రియామధుమతి అని 'శక్తికూటము (కుల, ఆకుల మార్గము ) అంటే రక్త శుక్ల సహస్రారముల మధ్య వున్న మార్గము.. ఆ తల్లి యుక్క రహస్యం 🙏 🌺క్రియారూపేణ మన నిత్య, నైమిత్య జీవితములో నడుమ భాగము నుండి క్రింది భాగం వరకు చాలా వత్తిడికి ప్రభావితం అవుతాయి . ఈ నామము వల్ల మన శరీరములలో ఆ భాగానికి శక్తిని ప్రవేశ పెట్టి,చైతన్యవంతం చేస్తుంది🌺 |