*స్తనభార* : బిందువికాసనానికి గుర్తు. బిందువు వికసిస్తే వృత్తమవుతుంది అంటే శివస్వరూపం. బిందువు వికసిస్తే త్రికోణము అవుతుంది, అంటే శక్తి స్వరూపము. ఆ రెండు తానే కనుక, తన స్తనాలను శివశక్తి స్వరూపంగా భావించాలి. రవిసోమాత్మకమైన(పగలు , రాత్రి) కాలాన్ని భరించే తల్లి అని అర్ధం. తల్లి కాలస్వరూపిణి
*దళన్మధ్య* : సృష్టి అంత అంశాంశములుగా ఏర్పడినప్పటికీ తాను సర్వాంతర్యామి కాబట్టి, ఆ అంశల మధ్యన కూడా తానే వున్నది అని అర్ధం.
మరొక అర్ధము, తల్లి ఉదరము , స్తనాలు మధ్య భాగము.
*పట్టబందవళిత్రయా* : అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర స్వరూపిణి. మాతృకావర్ణరూపం, త్రికోణ స్వరూపిణి. సార్వత్రిపుటి త్రాయాలక్షణము కలది. మూడు వేదములు కూడా అమ్మవారిని త్రయా అన్న నామము చేత పీలుస్తాయి.
ఈ నామానికి సామాన్య అర్ధం,..
నడుము సన్నదిగుటచే స్తనాల బరువుకి వాలిపోతుందేమో అనీ, బంగారు పట్టికలు మూడుసార్లు నడుముకి చుట్టినట్టుగా, మూడు ముడతలు ఉదరం పై ఏర్పడిన తల్లికి నమస్కారము 🙏
*🌺ఈ నామం వల్ల మనలో* 🌺
త్రయ లక్షణములను, సత్వ - రజో - తమో గుణాలను, అదుపులో పెట్టుకొని, ఆ యా సందర్భాన్నిబట్టి మన జీవితంలో వాటిని ఉతేజ పరిచే జ్ఞానం కలుగుతుంది. 🙏
|