*దేవ* : కాంతితో కూడిన సర్వము దేవ. ఆ కాంతిని సృష్టిలో ఈ దేవతలకు మరికొంచం ఎక్కువ యిచ్చి తన సేవ చేయించుకుంటోంది.
*ఋషిగణ :* అనగా నామరూపములతో సామాన్య జగత్తునందు జన్మించి ఈ మయాచాపల్యముల బోలికి పోకుండా ఈశ్వర ప్రణిధానం చేయటానికి ఆత్మను ప్రయాణంచేయించే బ్రహ్మసంస్కార లక్షణం.
అట్టి బ్రహ్మజ్ఞానులైన వారిని ఋషిగణ అంటారు.
ఋషిగణము అంటే దూరమున , సమీపమున మూడు కాలములలో, అష్టదిక్కుల యందు ఎక్కడ ఏమి జరుగుతున్నదో, ఇక్కడే కూర్చుని చెప్పగలిగిన దివ్యదృష్టి వున్నవారు. వారు దైవసమానులైన ఋషులు.
*సంఘాత :* అమ్మవారు ద్వైత బుద్ధిని మనలో మాయగా ప్రవేశపెట్టినప్పటికీని బ్రహ్మబుధిని కూడా మనలో వుంచింది. బ్రహ్మబుధి ఆత్మలక్షణము. లౌకికబుధి మాయలక్షణం, బ్రమాలక్షణం. ఈ రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఒకప్పుడు అదియే ఇది అని, ఇదియే అది అని బ్రాంతి కలుగుతుంది. బ్రాంతికలిగినప్పుడు మిస్రమభావాలు కలుగుతాయి. అట్టి విషయాన్ని సంఘతము అంటారు.
లేదా, అవి శత్రువుల వలే పోరాడుకున్నట్లయితే బ్రహ్మమే గెలుస్తుంది. అప్పుడు వారి జీవితం సార్ధకమవుతుంది.
*స్తూయమాన* : అమ్మవారు నాదస్వరూపిణి, ఓంకారస్వరూపిణి కాబట్టి ఆమె సావిత్రి, గాయత్రీ ఇత్యాది నామములతో వున్న లలితపరంజ్యోతి. ఆమె నుండి వచ్చిన పరానాదము పశ్యంతి, మాధ్యమా, వైఖరి రూపములతో, సమస్త భాషా సారస్వతముల రూపముతో, ఈ ప్రపంచములో అందరూ మాట్లాడుతూ ఉంటే అందరి జివ్హాల పైన సత్యముగను, అసత్యముగను, మాయగానూ, మోసముగాను, మంత్రముగను, స్తోత్రముగను - అన్ని విధములుగా ఆమె నర్తిస్తూ ఆనందాన్ని పొందుతుంది.
ఐతే అన్నిటికంటే ఆమెకు ఇష్టమైనది ఏమంటే, ఆమె నామములు చక్కగా పారాయణం చేసే చోట లలితపరమేశ్వరి రూపముతోనే ఆ జివ్హాపై నర్తిస్తూ, ఆ జీవియుక్క సంస్కారాలను బ్రహ్మసంస్కారములుగా మర్చి, వారి జీవితాలను ధన్యం చేస్తుంది. స్తూయమానా అంటే పొగడబడుచున్నది అని అర్ధం.
*ఆత్మవైభవా* : మనయుక్క ఆత్మ మేల్కొని నేను బ్రాహామును, నేను అంస్వరమును, నేను చావు పుట్టుకలకు లొంగనిదాన్ని అని,.. తెలుసోకోవటమే ఆత్మవైభవం.
నేను ఈ శరీరము కాదు, పంచభూతములుకాదు, సప్తధాతువులు కాదని తెలుసుకోవడమే ఆత్మవైభవం.
ఈ శరీరము నాది, నేను ఈ సంకల్పము చేసాను, నేను ఈ పని కి కర్తృత్వం వహించాను. నేను చేసిన పనికి గుర్తింపు రాలేదు. నేను అన్నది నేను కాను, నేను వేరు ఆత్మ వేరు అన్న భావన రావాలి.
అప్పుడే ఈ లోకికమైన గుర్తింపులకు మనము ఆశ పడము. అమ్మవారికి మనయందు కరుణ ద్రుష్టి పడాలి అని మనము నిత్యము పాటుపడతాము.
నేను, నేను అన్నది మాయా లక్షణము.
అమ్మవారు ఆత్మస్వరూపముతో అంశరూపముగా మనయందు వున్నదని తెలుసుకోవటమే ఆత్మవైభవం. పరిపూర్ణ తత్వమే ఆత్మవైభవం.
'దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవా ' అంటే మాతృకామాలాస్తోత్ర స్వరూపిణి అని అర్ధం. దేవా అంటే సూర్యనేత్రం, ఋషి అంటే చంద్రనేత్రం. గణసంఘాత అంటే అగ్నినేత్రం.
ఏదైనా రాపిడి జరిగినప్పుడే, సంఘాతం జరిగినప్పుడే ప్రుద్విలో అగ్ని పుడుతుంది. కాబట్టి దేవర్షి గణ సంఘాత అన్న మూడు మాటలచేత సూర్య, చంద్ర, అగ్ని నేత్రములు కలిగిన తల్లీ అని అంతరార్థం.
'పృథ్వి అపస్తేజోవాయురాకాశములలో పంచభూతముల సంఘాతము వలనే చిదగ్ని పుడుతుంది. అది కుంత దృశ్యము కావచ్చు, మరికొంచం అదృశ్యము కావచ్చు. అమ్మవారియుక్క నామ కీర్తనముచే వీటికి అంతరార్ధం తెలుసుకోగలుగుతాము.
సకల దేవర్షి గణాలచే కీర్తింపబడు తల్లికి నమస్కారము 🙏
🌺నేను ఎవరు???, అన్న ఆలోచన మొదలౌతుంది. ఈ ప్రాపంచిక, భౌతిక విషయాలను దాటి, ఆత్మ పరిశోధన జరగాలి.
అమ్మ వారిని ఆమె యుక్క నామములతో కీర్తిస్తూ ఈ విషయాన్ని తెలుసుకుందాము. 🌺🙏
|