ఇందులో గుప్త నామాలు
1 *ఉజ్జ్వల :* లలితా పరమేశ్వరి పరంజ్యోతి ఒకటే , ఉజ్జ్వల అని పిలువదగినది .కారణం అది కాంతి కి కాంతి. సర్వణువులయుక్క హృదయమునందు దాగి సర్వవ్యాపిణిగా సృష్టికి కారణమైన కారణంచేత అమ్మవారు ఉజ్జ్వల . అంటే శుక్ల రక్త బిందువులయుక్క సమ్మెళనముచేత కలిగిన బిందు , స్పంద ప్రతిస్పందములయుక్క నాదమే అగ్నిగా , అదియే పరంజ్యోతిగా ఆరు ఆకాశములను (బూర్ , బువర్ , సువర్ , మహర్ , జనో , తపో )సృష్టించి భూతాకాశంచేత అనేక కోటి బ్రహ్మాండ జనని అయింది .
2. *కోశోజ్వల* : అమ్మవారు దర్భ యుక్కా ముల్లువలే చాలా సన్నని అనుదీపం . ఇది నిజంగా దృక్ రూపంలో ఎవరికైనా దర్శనం ఇస్తే కుశాగ్రమంత చిన్నగా ' నివారసుకము ' అన్న సూక్ష్మంగా కనిపిస్తుంది అని చెప్పటానికి ఇక్కడ కుశోజ్వల అన్న నామం నిదర్శనం .
3. *అంకుశోజ్జ్వల* : అంకుశము ఏనుగుని శాసించేది , దారిలో నడిపించేది. ఏనుగు అంటే గజము .ఇక్కడ అమ్మవారి గజం జగత్తే . అక్కడ గజము ఇక్కడ జగము . ఈ జగము అన్న వాహనంపై అమ్మవారు వెళ్తూ తన కాంతి అనే అంకుశం చేత దానిని నియమించి , పాలించి పోశించి , సృష్టించి , లయకరిస్తుంది . కాబట్టి ఆమె అంకుశ ఉజ్జ్వల అయింది .
4. *క్రోధంకుశ* : ఇక్కడ క్రోధ శబ్దము చేత సాహిత్య పరంగా కోపము తామసము అని చూపుకోకూడదు . శ్రీవిద్య రహశ్యం ఏమంటే శక్తి యుక్కా విస్ఫోటమే క్రోధము .క్రోధంకుశ అంటే సంకల్పతీతుడైన ఈశ్వరునకు వికల్పము కలగడమే క్రోధము .గుణమునకు లొంగినది , నిర్గుణము సగుణమైనది అని అర్ధం.
కాబట్టి దుర్గుణము , సగుణమును రెండింటిని సమానముగా శాసించగలిగే పరాలలిత క్రోధంకుశ .ఇక్కడ క్రోధ శబ్దముచేత సామాన్య కోపమనికాక శక్తి విస్ఫోటమని చెప్పవలె .
శ్రీవిద్య పరంగా చుస్తే క్రోధము శక్తి విస్ఫఫోటము అని గ్రహించాలి . ఈ విస్ఫఫోటమును నియమించు శక్తి లలిత మాత్రమే . ఆ మదాన్ని దమంగా మార్చగలగాలి .మదానికి దమానికి కేవలము అనులోమ విలోమ. సంబంధము .
అనులోమంగా చుస్తే మాయ అవుతుంది . విలోమంగాచూస్తే అది బ్రహ్మమార్గమై , ఆత్మమార్గమై మానవులను తరింపచేస్తుంది . ఆ మదానీ దమంగా మార్చగలిగే తల్లి క్రోధాకారాంకుశోజ్జ్వల .
దుష్టశక్తులను అణిచి వేయడానికి కుడిభాగంలో క్రింది చేత క్రోధమనే అంకుశాన్ని ధరించిన తల్లికి నమస్కారము 🙏
🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనం* 🌺
క్రోధము , ద్వేషము మన యుక్కా సంస్కారాన్ని దిగిమింగి పతనానికి దారి తీస్తాయి . వాటిని నియంత్రించుకోగల సమర్ధతను పొందుతాము . క్రోధము ఒక బలహీనత , అది మన మానసిక , శారీరక ఆరోగ్యములను పాడుచేస్తుంది అని గ్రహించి విశ్లేషణ చేసుకోగలిగే వివేకాన్ని పొందుతాము
|