*నాభి* : మానవుని శరీరంలో
1)మూలాధారచక్రం : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది.దీనికి అధిపతి గణపతి; నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది.
2)స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. సింధూరవర్ణంలో ఉంటుంది.ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది.
3)మణిపూరక చక్రం : బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది
4)అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది.
5)విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు లో ఉంటుంది.
6)ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది.
7)సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. దీనికి ఫలం ముక్తి.
జగన్మాత వీటిన్నిటికి అధిష్టాత్రి.🙏
మానవునియందు వున్నా నాభి స్థానము మణిపుర స్థానము. మూలాధారము, స్వాధిష్ఠానములు దాటుకొని వచ్చిన తరువాత మణిపురము దగ్గర తన స్వప్నరూప జ్ఞాన కుండలి అపుడే సుషుమ్న అవుతుంది. నాభి అంటే సుషుమ్న యుక్క స్వస్వరూప జ్ఞాన లక్షణము.
*అలవాలము* : అంటే పాదు. జగన్మాత శివశక్తి బిందు స్వరూపిణిగా సమస్త సృష్టి ఆలవాలమైనది. ఆమెయే బిందువు, ఆమెయే బీజము, ఆమెయే నామరూపములు. ఆమెయే ఆలవాలము.
*రోమాళి* : రోమాళి అనగానే ఆకాశము అని జ్ఞాపకము రావాలి. అమ్మవారి కబరి ఫలమే ఆకాశము. అందులో తురిమిన పువ్వులు, ఆభరణాలు, గ్రహ నక్షత్ర తారకాకోటి ఇద్యాదుల్ని. అమ్మవారి యుక్క రూపం బిందువు నుంచి నాభి ద్వారా, ఈ సమస్త భూమండలానికి ఆహారము కొరకు పునాది వేసింది.
*లతాఫలా* : కాంతియే ఒక లత, దానికి ఫలము, సాఫల్యము, స్వర్గము, వైకుంఠము చివరకు లయము.
ఈ లతా ఫలము సకామపూజ చేయువారికి ఇహపరయందు ఐహిక, ఆముష్మిక సఫలప్రాప్తినీ కల్పించేది అని ఒక అర్ధం. నిష్కమపూజ చేయు వారికీ లయాప్రాప్తి కల్గుతుంది. లతాఫల అంతే లతకు ఏర్పడిన ఫలము, ఎటువంటి ఫలము !?..
సుషుమ్న బ్రహ్మణి నాడిలో ప్రయాణముచేస్తే బ్రహ్మశీర్షములో వున్నా అమృతఫలాన్ని పొందుతుంది.
అంటే నిర్వాణము, మొక్షము.
*కుచద్వయీ* : అమ్మ ఒక్క నాభినుండి ఉదయించి పైకి విస్తరించిన నూగారు అనే లతకు రెండు పళ్ళు కాసాయి. అవే అమ్మ యొక్క కుచద్వయం.
పాంచభౌతికాలను, సప్తధాతువులను పోషించే బిందు స్థానాన్ని సాధన చేసి ఆత్మకు ఆహారముగా అమృతప్రాయంగా చేసుకోవాలి అంటే అమ్మవారి మేడలో అక్షమాల గా వున్నా మాతృకావర్ణములనే మంత్రాలను ఆశ్రయించవలెను.
పసిబిడ్డ తల్లి దగ్గర స్థన్యము తాగుతూ కూడా ఒక చేతితో ఆ తల్లి మేడలోవున్నా హారములను పట్టుకుంటాడో, ఆ విధముగా అక్షమాలను చేత అ జగన్మాత నీ ఆశ్రయించాలి. అంతే కాక సమస్త జగత్తును ఆ తల్లి యుక్క కుచములే మనయుక్క అన్నకోశాన్ని పెంచి పెద్దచేస్తాయి..
కాబట్టి కుచద్వయము అంటే అండపిండ బ్రహ్మాండములయందు, జీవులయయందు అన్నకోశము, అదీ కోరే కారణమైన ఆకలి కూడా ఆమేయే.
ఆ ఆకలిని తీర్చే అన్నస్వరూపము కూడా ఆమెయే. ఈ రీతిగా ఆమె త్రిపురసుందరి 🙏.
🌺 *ఈ నామం వల్ల మనలో మానసిక* *పరివర్తనము* . 🌺
మనము స్వీకరించే ఆహారము అంతా ఆ జగన్మాత యుక్క భిక్ష. ఆ భిక్షను మనము భుజించేటపుడు, జగన్మాత, పరమాత్మ యుక్క నామస్మరణ చేస్తూ , ఆమె యుక్క లీలలు ను స్మరించుకుంటే, మన శరీరము అవయవాలు అన్నియు సక్రమంగా వాటి పనులు చేస్కుంటూ వెళ్తాయి.
మనము ఆరోగ్యాంగా ఉంటాము🙏
|