శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
61. సుధాసాగరః మధ్యస్థా | ||
*సుధా* : అనగా అమృతము, అంతేకాదు, మనలో వున్న నాదబిందు కళలయుక్క ఐక్యమును సుధా అంటారు. అవి సహస్రారము పైన జరుగుతాయి. సహస్రారము క్రింద నాద, బిందు కళలుగా వేరు వేరుగా వుంటాయి. ఎప్పుడైతే ముఖ్యప్రాణ స్వరూపిణి ఈ సుషుమ్నా సహస్రారమునుండి పైకి వెళుతుందో అప్పుడు బ్రహ్మశీర్షము దగ్గర అమృతవర్షం ప్రారంభం అవుతుంది. ఆ తేజాస్సునే అమృతవర్షం. అదే సుధా. *సాగర* : ఆమె అనంతస్వరూపిణి కాబట్టి సాగర అంటే సముద్రము, అనంతము. సర్వప్రపంచమునందు ఉదానవాయు స్వరూపిణి అని కూడా అర్ధం. *సుస్థా* : శ్రీచక్రం త్రికోణమునందున్న దానిని ' సు ' అంటారు. అంటే విశ్వయోని, భగవతి, భగమాలిని. అక్కడనుండే సృష్టి పుట్టింది. 'స్థా' బిన్దుస్వరూపిణి. ప్రపంచ అభివ్యక్తి ఆ త్రికోణాంతర బిందువు నుండే వచ్చింది. శ్రీచక్ర బిందువు స్థానమే సుధాసాగరము. బ్రహ్మణి అయినా పరదేవత అందు నివసిస్తుంది. అమృత సాగరము మధ్యన వసించు తల్లికి నమస్కారము 🙏 శిరస్సులోని సహస్రార కమల కర్ణిక ఉండే భాగాన్ని సోమమండలము లేదా అమృతసాగరము అని అంటారు. అట్టి స్థానమున లలితాంబిక కొలువై వున్నది. 🙏 🌺క్షీరసాగర మధనం లాగా, మన మనస్సు ఎప్పుడు హరి నమ, రామ నామము తో రాపిడి జరుగుతు వుండాలి. దేవుడిని తెలుసుకోడానికి, దెగర అవ్వటానికి మనము నిరంతరమూ మన మనస్సు ఓ సాగరము దానిని కవ్వము అనే రామ స్మరణ తో/మధనము చేస్తువుంటేనే,... రామామృతం మనకి దక్కుతుంది. అప్పుడు అంతా రామమయం, జగమంతా రామమయం. 🌺🙏 |