*మనోహరా* : అంటే మనస్సును హరించేది అని ఒక అర్ధం . సౌందర్యయుక్తమైనది , మనస్సునకు ఆనందమును కలిగించేది అని .
సౌందర్య యుక్తమైనది అంటే అమ్మవారి యుక్క రూపముగా , అమ్మవారి యుక్క శ్రీచక్రంగా , అమ్మవారి యుక్క శ్రీవిద్య మంత్రము వీటిని పోల్చతగినవి ఏమియు లేవు . ఆ కారణం చేత ఆ తల్లి సౌందర్య లహరీ , మనోహరి .
*కర్ణమంజరి* : సాధారణంగా లోకంలో కర్ణమంటే చెవి అన్న అర్ధం తీసుకుంటాము . చెవియుక్క తన్మాత్ర , నాదము .
సప్తకోటి మహామంత్రములయుక్క నాదస్వరూపము ఆమె కాబట్టి ఆమె కర్ణ మంజరీ .
కర్ణ అంటే చెవి అనుకున్నపుడు అది నాదమును వినగల్గినపుడే దాని ప్రయోజనము .
ఆ నాదము మంత్రములనుండి , బహుభాషలనుండి , 84 లక్షల జీవరాశులనుండి వచినప్పుడు ఆ నాదములన్ని కలిసి ఒకటే నాదమైన ' *ప్రణవనాద '* మవుతుంది .
కర్ణ మంజరీ అంటే నాదరూపిణి అని అర్ధం .
లలితపరమేశ్వరి కర్ణోపరి భాగమున అలంకరింపబడిన కదంబ కుసుమ స్తబకము చేత సౌదర్యాతిశయముగా వున్నది అని ఈ నామం యుక్క సామాన్య అర్ధం .
ఇక అంతరార్ధము లోకి వెళ్తే ,...
సప్తకోటి మహామంత్ర సముదాయము , చతుషష్టికోటి యోగిని గణదేవతలు, పరమేశ్వరుని యుక్క నామకీర్తనం , చెవులకు ఇంపుగా చేయగా ఆ సామవేద సంగీత్ నాదము ఆమెకు బహిర్నదాభరణ మైనది .
అది కదంబ మంజరీ ప్రతికము .
పరానాదమైన పరమేశ్వరి అంశరూపములైన గణదేవతలుచేత ప్రస్తుతింపబడిన ప్రశ్యంతి , మధ్యమ , వైఖరీ నాదములే కదంబమంజరి .
ఇది అంతరార్ధం ,...
చెవుల ఫై భాగంలో కదంబ పూలుగుత్తిని ధరించడంచే రమణీయంగా భాసించు తల్లికి నమస్కారము 🙏
.🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే*
*మానసిక పరివర్తనము* 🌺
విషాయ జ్ఞనమును తెలుసుకునే ఇంద్రియమైన చెవులు ఓంకారాన్ని , శ్రీకారాన్ని అంటే శుభతత్వములను , పరిమళింపజేసే పుష్పములు వంటి విషములను వినడానికి తగిన ఆసక్తి కలుగుతుంది 🙏
|