*ప్రాణ* : అమ్మవారు జగతప్రాణ. మన శ్వాస రూపములో వున్న ప్రాణ గాయత్రీ.
*హర* : హరి, హర, విరించి ఈ ముగ్గురియుక్క స్వరూపమే శ్రీచక్రoతర త్రికోణ స్వరూపము.
*హరణ* : సర్వమును లయకాలమునందు హరించునది.
*వారాహి* : విశ్వ కుండలిని రూపము
*వీర్య* : సమస్త శక్తులు తానెయైనది కాబట్టి ఓజస్సు, భ్రాజస్సు, తేజేసు కలిపి వీర్యమైనది.
*వందిత* : సర్వ జగత్తు ఆ మాతకు నమస్కారము చేస్తూనే వుంటుంది తెలిసో, తెలియకో.
తెలిసి నమస్కారము చేయటం చేత పుణ్యము, తెలియక నమస్కారము చేయటం చేత మనలో వుండే పాపము హరణము అవుతుంది
విసుక్రప్రాణముగా జీవిలోనీ అహంకారమును, జీవవృత్తులను, కామమును ప్రేరేపించేవి.
ఎంతవరకు మాములుగా శ్వాస పంచప్రాణముగా సంచరిస్తున్నదో అంతవరకూ దేహధర్మాన్ని అంటే పంచభూత, సప్తధాతు లక్షణ సారాంశమైన శుక్ర శోణితాలను మాత్రమూ పెంచుతుంది.
దాని వర్ణ చాపల్యము తన్మాత్రవైపు అనగా విశయాశక్తి, నామ రూపాల వైపు, స్వ, పర భేదమువైపు లౌకికముగా ప్రయాణిస్తుంది. కామమే దాని చివరి మెట్టు.
వారాహి వీర్యము అంటే జాగృత కుండలిని ముఖ్యప్రాణముగా సహస్రారమువైపు పయనించటము.
🌺లౌకికముగా మన జీవన విధానము లో కాస్త డబ్బు, చదువు, కీర్తి, పలుకుబడి వున్న దేగ్గెర అహంకారము, కామము, క్రోధము వంటి లక్షణాలు సహజంగా కనబడుతాయి. ఆ జగదాంబ పాద సేవలో ఉంటే, వాటిని వధ చేయటానికి వారాహి రూపము లో వున్న అమ్మవారు వాటిని వధ చేస్తుంది. అట్టి ఆ తల్లీకి నమస్కారము🌺🙏
|