*నఖదీధితి* : నఖముయుక్క కాంతి. అమ్మవారియుక్క పది నఖములనుండి దశావతారములు వచ్చాయి కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి : అన్న నామము దీని సంబంధిత నామము.
నఖదీధితి వలన సృష్టి పరిణామ క్రమము ఏర్పడినది.
అదే నారాయణ దశాకృతి. నారాయణ అంటేనే సృష్టియుక్క పదమని అంతరార్ధము. పరం జ్యోతి స్వరూపం.
*జనతమోగుణ* : జనులమధ్య తమోగుణ రూపంలో క్రియాశక్తిని ప్రేరేపించేది. క్రియాశక్తి ఉంటేనే సృష్టి నడుస్తుంది. కాబట్టి తమోగుణమే క్రియాశక్తి.
వివేకము జ్ఞనాశక్తి, సంకల్పము ఇచ్చాశక్తి. శుద్ధతమోగుణ లక్షణమే సంకల్పము. శుద్ధ రజోగుణ లక్షణమే జ్ఞ్యానము. శుద్ధ రజోతమోగుణ లక్షణముల మిశ్రమమే తమోగుణము. దానినే శుద్ధసత్వము అంటారు.
ఆ శుద్ధసత్వము తో రజస్సు మిళితమైతే, ఆ రజస్సు తో మరల తమస్సు మిళితమైతేనే, అంటే మూడు గుణాలు మిళితమైతేనే తమోగుణము వస్తుంది.
రజోగుణంలో సగం రజస్సు మిగిలిన సగం తమస్సు.
ఈ రీతిగా అయితేనే సత్వం అనే దానికి ఒక కదలిక వస్తుంది.
పంచ భూతములు ఎలా పంచికరణము వున్నదో, గుణములు కూడా ఆ విధముగా త్రిపుటికరణమని వున్నది. ఇది రహస్యం.
ఈశ్వరుడు సంకల్పము చేసినప్పుడు శుద్ధసత్వము సత్వగుణమవుతుంది. ఆ సత్వగుణానికి అమ్మవారు లోపలే మేల్కొని రజోగుణమై ఆయనకు నిశ్వాసముగా బయటకు వస్తుంది. ఆ నిశ్వాసము శుద్ధ రజస్సుయుక్క లక్షణము కలది.
దానియందు ప్రతిబింబము రావాలంటే తమోగుణ లక్షణము అందులో కలిస్తేనే కానీ ప్రతిబింబమనే ద్వితీయం రాదు. కాబట్టి ఆ బిందువు శుద్ధసత్వరజస్తమోగుణములు కలది.
బిందువు త్రికోణముగా భావిస్తే, పైది సత్వగుణము , కుడివైపు రజోగుణము, ఎడమవైపు తమోగుణము.
ఇది త్రిగుణ త్రికోణము. గుణములుగాచూస్తే ఈ విధముగా చూడవలెను.
ఆ బిందువును కాంతి గా చుస్తే, భగమాలిని, వజ్రమాలిని, అంశుమాలిని అన్న మూడు కాంతి కిరణములుగా చూడవలెను.
నాదముగాచూస్తే, పశ్యంతి, మధ్యమ, వైఖరిగా చూడవలెను. ఒకటే త్రికోణమును ఇన్ని రకములుగా భావన చేయాలి.
అమ్మవారు తమోగుణ స్వరూపిణి. తమోగుణమే కాళిక. కాలస్వరూపము. కాలము వలెనే కాలికస్వరూపము ఏర్పడినది. తమోగుణము నల్లగా వుంటుంది.
రజో గుణము ఎర్రగా వుంటుంది. సత్వగుణము తెల్లగా వుంటుంది.
ఆ కారణంచేత సర్వగుణ సంపన్నమైన బ్రహ్మయుక్క భార్య సరస్వతి దేవి సర్వశుక్లా అని సత్వ గుణ ప్రభావంగా శుక్ల అంటే తెలువు రంగు.
విష్ణువుది రజోగుణము కాబట్టి అమ్మవారు లక్ష్మీదేవి ఎరుపు, పసుపు కలిసిన బంగారు చాయ.
తమోగుణము కాళికా స్వరూపము, నల్లగా వుంటుంది.
అట్టి ఆ గుణాలుగల తల్లికి నమస్కారము చేసినట్లయితే తమోగుణము, రజోగుణము తీసివేసి, సత్వగున్నాని మనకు ప్రసాదిస్తుంది.
*సంఛన్న గుణ* : అంటే గుణాతీతురాలు. సంఛన్న అంటే గుణములను తీసివేస్తే ఇక మిగిలేది బ్రహ్మమే. అంటే మాయయుక్క వ్యక్తస్వరూపాన్ని తెసివేయగలదు అని అర్ధం.
కాబట్టి నఖదీధితి అంటే నవగ్రహములు ఆపైన వాటికీ వెలుగునిచ్చే తల్లి అని అర్ధము వాటియుక్క అఖండ దీప్తియే శ్రీమాత.
దీధితి అనగా ప్రజ్ఞ అని కూడా అర్ధము ప్రజ్ఞ వలన ప్రజ్ఞానము వస్తుంది. ప్రజ్ఞానము చేత తమోoధకారమూ పోతుంది.
ద్వైతవృతి నాశనమగును. " ప్రజ్ఞానంబ్రహ్మ, ఓం ఇత్యేకాక్షరంబ్రహ్మ, తత్వమసి, అహంబ్రహస్మి అయమాత్మబ్రహ్మ " మహావాక్య జ్ఞానమే ప్రజ్ఞానము.
అమ్మవారి పాదాభివందనము చేత ఆ పరిజ్ఞానము వస్తుంది. ఇది సిద్ధమగును. ఇది రహస్యతి రహస్యం.
శ్రీపాదుకలే గురుపాదుకలు, మణిపాదుకలు.
తనని నమస్కరించు వారి అజ్ఞానాధకారాన్ని నశింపజేయు నఖకాంతులు (గోళ్ల నుండి వచ్చే వెలుగు, ప్రకాశము ) గల తల్లికి మమకారము 🙏.
*ఈ నామం వల్ల* మనకి ప్రజ్ఞానము కలిగి, అమ్మాయుక్క కాలిగోరు లో వున్న తేజేసు వంటి ప్రకాశం మనకి పెద్దలను, గురువులకు పాదాభివందనము చేసినప్పుడు కలుగుతుంది. 🙏
|