శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
47. మరాళీమందగమనా | ||
హంసవలె మందగమనము నడక కలిగినది. *మందగమనా* : జాగృతకుండలిని తానెవ్వరో తెలుసుకొని, తాను ఎక్కడ చెందియున్నదో తెలుసుకొని, పారవశ్యంతో నాట్యం చేస్తు ఈ చక్రలోనుండి వెళుతూ వుంటుంది. ఆ వివశనాట్య లాస్యమే మందగమనా. *మరాళి* : మూలాధారము దగ్గర బయలుదేరిన కుండలిని జ్ఞాన, జ్ఞాత, జ్ఞేయము అన్న త్రిపుటికల త్రిపురాంగనగా బయలుదేరుతుంది. అదియే మరాళి, హంస. అక్కడ నుండి జ్ఞాతను నేను అన్న భావన రాలిపోయి, మందగమన అవుతుంది. అంటే నిర్లిప్తిత ఏర్పడుతుంది. ఈ నామము దాహరచక్ర పుజారహస్యం. అదియే సమయాచారము. ఆడ హంసవలే మందగమన (మెల్లని నడక)గల తల్లికి నమస్కారము 🙏 🌺ఈ నామం మన జీవితంలో చాలా విశేశమైన మార్గము చూపిస్తుంది. ఆడహంస వలే నిటారుగా, నెమ్మదిగా నడవటం చేత మన నడిచే తీరులో, మన సంస్కారము, జ్ఞ్యనము, సామర్ధత, ఆరోగ్యం, ప్రాణ శక్తి మనకు తెలియకుండానే ప్రభావితం అవుతాయి. మన ఆయుర్ధాయం, ఆరోగ్యం పెరుగుతుంది.🙏🌺 |