శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
68. చక్రరాజరధారూఢ సర్వాయుధపరిష్కృతా | ||
*చక్రరాజరధ* : శ్రీచక్రమే జగజ్జనని అధివశించే రధము. ఆది తొమ్మిది పర్వముల రధము . అవే నవవర్ణములుగా మనచేత పూజితములవుతాయి. దానినే చక్రరాజరధము అంటారు. పిండాండములోకి, అంతర్యాగ రహోయాగములోకి వస్తే చక్రరాజము సహస్రారము. రధము క్రింద వున్న అన్ని చక్రములతో కూడిన శరీరము అనగా సహస్రారముతో కూడిన సప్తధాతుమయ దేహమని అర్ధము. *సర్వరూఢా* : సర్వమునకూ ఆధారభూతమైనది అనగా సర్వేశ్వరీ. *ఆయుధరాజ:* శ్రీచక్రమే ఆయుధరాజము. **పరిష్కృత* : ఆమెలో లేనిది ఏదియు లేదు, కనుక ఆమె సర్వ పరిష్కృత అని అర్ధం. చక్రరాజమునెడి రధమును అధిరోహించి సర్వాయుధములతో కూడినది అని అర్ధం. శ్రీచక్రమే చక్రరాజరాధము. మంత్ర , యంత్ర, తంత్ర, లయ, సంకేతములే చక్రములు. నవావరణలే రథముయుక్క నవపర్వములు. ఆయుధసంజ్ఞగల దేవతులు, భూపురంలో 28 మంది. షోడశారంలో 16మంది. అష్టదళంలో 8మంది, మన్వస్రంలో 14మంది. దశరయుగ్మయంలో 20మంది, వసుకోణంలో 8మంది. త్రికోణములో 7మంది. మొత్తం 101 మంది. ఈ పరివార దేవతలందరూ ఆయుధ ప్రాణులే. అమ్మవారికి అస్రప్రాయులే. ఆయుధములనగా శ్రీచక్రములోని కోణములని రహస్యం. రెండు చక్రములు ఒకటి ఆకులమార్గములో చక్రము అంటే సహస్రారము అంటే పరమాత్మ దర్శనం. . కులమార్గంలో చక్రము అంటే అజ్ఞాచక్రం అంటే ఆత్మ దర్శనము. ఈ రెండు ప్రధాన చక్రములు. పరిష్కృత అనుట చేత ఆయుధముల యుక్క అపరాజితా లక్షణము తెలుపు తుంది. సర్వాయుధాలతో చక్రరాజ అనే రధాన్ని అధిరోహించిన తల్లికి నమస్కారము 🙏 🌺ఈ జీవితము అనే చక్రములో మనమే అధిష్ఠానులం. మంచి చెడు ఆలోచన చేస్తూ, ఇతరులకు మనవంతు సాయం చేస్తూ, మంచి మాటలు పలుకుతూ, అధైర్య పడకుండా, మన ఈ జీవిత చక్రాన్ని మోక్షం వైపు మరలించాలి.🌺 🙏 |