శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
15. అష్టమి చంద్ర విభ్రజ దళికస్థల శోభితా | ||
*అష్టమి* : ఎనిమిదవ సంఖ్యా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది .చంద్రకళావిద్యలో సగము కళలు ఈశ్వరునివైతే సగము కళలు శక్తివి . అష్టమి కళ ఉండటం చేతనే ఈశ్వరప్రతిబింబము అందులో ఇమిడింది .అంటే శివుని కంటే ఒక కళ తల్లికి ఎక్కువ . ఆ కలయే ఆమె కిరీటంపైనా చంద్రకళావతంసగా వున్నది . *అష్టమి చంద్ర* : అష్టమి నాటి చంద్ర స్వరూపం శుక్లపక్షమునందైనా , కృష్ణపక్షమునందైన వృద్ధి క్షయములు లేనట్టిది . అందుచేత ఆమె అష్టమి చంద్రకళా విద్యలో పూజిత అవుతుంది . *విభ్రాజ స్థల* : అనంతమును నాల్గవవంతు నామరూపాత్మక సృష్టిగా చేయడమే . త్రిపాదములు ఊర్ధ్వమునందే , ఈశ్వరునందే వుండగా ఒక పాదము మాత్రమే నామరూపాత్మక జగత్తుగా ఈశ్వర సంకల్పము సృష్టి చేసింది . కాబట్టి విభ్రాజ స్థలము అంటే అనంతమును విభజి౦చిన శక్తి , దానిని స్థలముగా మార్చినది . అదియే మహామాయా , అదియే మహా త్రిపురసుందరి . *అలిక* : సమూహము అని అనవచ్చు , నుదురు , లలాటము , అని కూడా అనవచ్చు .విశాలమైన నుదురుకలది . *శోభితా* : అంటే అలంకృత అని అర్ధం . ఈశ్వర్ సంకల్పం చేత , ఈశ్వర్ ప్రతిబింబం చేత , అలంకృతమైనది రక్తబిందువు . కాబట్టి శోభిత అంటే కేవలం అలంకృతమైనది అని మాత్రమే కాదు .ఈశ్వర ప్రతిబింబమును తనలో అలంకరించుకొని సృష్టి రచనా కార్యక్రమానికి వుపక్రమించిన జగన్మాయయే రక్తబిందువు. అది శోభిత . అష్టమి తిధినాటి చంద్రుని మాదిరిగా ప్రకాశించే లలాట ప్రదేశం గల తల్లి కి నమస్కారము 🙏. 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనము* 🌺 మనకు కలిగే భావాభావములను , వాటిని సాధించడానికి కావలసిన మార్గాలను , ఆ ప్రయత్నములో కలిగే అనుభవాలను సమానంగా చూడగలిగే సమర్థత కలుగుతుంది 🙏 |