శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
85. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా | ||
*శ్రీమత్* : షోడశీస్వరూపమైన ఈశ్వర పదార్థమును తనతో కూడివున్నది కాబట్టి ఆమె శ్రీమత్. ఇక్కడ ఈశ్వర -ఈశ్వరి భేదము లేదు. జగత్ సృష్టికి మ్రత్రమే ఆ రెండు వేరు అన్న భావన. *వాక్భవము* :వాక్ భవము అంటే అగ్ని నుండి పుట్టినది అని అర్ధం. చిదగ్ని నుండి పుట్టినది కాబట్టి ఆ పరమాత్రుకయే జగజ్జనని. *కూటైక* : అన్ని కూటములను కలిపే అంతరశక్తి, ఆ జగన్మాతయే. *ముఖపంకజం :* అమ్మవారి యుక్క ముఖమే పద్మముయుక్క కాంతిని పోలివుంటుంది. *ఏకస్వరూప* : ఈ నామరూప ఉపాస్య దేవతా భావనకు వెనుక కేవలం పరంజ్యోతి అన్న భవము వున్నచో , అదియే ఏకస్వరూప లక్షణము. ఆ వాక్భవమే తల్లీ యుక్క ముఖము, మధ్యకూటము కంఠము దగ్గర నుండి కటిపర్యంతము, కటి నుండి పాదము వరకు. ఈ మూడు కూటములను అమ్మవారి యుక్క సూక్ష్మ రూపముగా భావించవలెను. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మనము దేని గురుంచైనా విశ్లేషణ చెయ్యాలి, నేర్చుకోవాలి, పరిశీలించాలి అంటే అది వాక్కు ద్వారానే సాధ్యం. వాక్కు వెలుపడేది ముఖంనుంచే కాబట్టి, మనము ఈ ప్రపంచానికి పరిచయము, సమాజము లో మంచి గుర్తింపు పొందగలుగుతాము 🌺 |