శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
7. చతుర్భాహుసమన్వితా | ||
ఇందులో గుప్త నామాలు *చతుర* : చతురత్వ మంటే నైపుణ్యము . ఎంత నైపుణ్యం పర దేవియందు నిశ్చితం కాకపోతే ఇంత వైవిధ్యమైన సృష్టిని ఆమె చేయగలుతుందన్న ప్రశ్న ఉదయిస్తుంది .ప్రతి జీవిలో వున్నా ప్రతిభ లేదా చాతుర్యమంతా అమ్మవారి స్వరూపమే అని భావించవలె .ఈ అన్ని ప్రతిభలకు మూలకందమైనది పరాలలిత . కాబట్టి ఆమె చాతుర్యమునకు చాతుర్యం అదే చతుర . *బహు సమన్విత :* 'ఏకానైకేతి ' తాను కావాలిఅనుకుంటే ఒకత్తే ఉండ గలదు , ఇచ్చ చేసి అనేకములుగా కూడా పరిణమించగలదు . ఆ కారణంచేత ఆమె బహు సమన్విత , ఉపాస్య దేవి అయినది . *హుత సమన్విత* : మనయందున్న చిదగ్నిని కూడా రగల్చి ధ్యానములో జాగృత , స్వప్న , సుషుప్తులను దాటి తురీయ , తురీయాతీతములకు వెళ్ళినప్పుడు మన అహమును ఆ చిదగ్నికుండములో హుతము చేస్తాము. కాబట్టి హుత సమన్విత అంటే స్వాధిష్టాన పరారాజ్ఞీ . ఆమెయే అహంకార స్వరూపిణి సృష్టి చెయ్యగల తల్లి ఆమెయే , మరల అహంకార స్వరూపాన్ని సంహారము చేయగలిగిన తల్లి కూడా ఆమెయే . ఆ కారణం చేత ఆమె హుత సమన్విత . అంతః కరణ చతుష్టయము అనబడే మనో బుద్ది అహంకార చితాలు , సాధన చతుష్టయము , చతుర్వేదములు కూడా ఈ చతుర్బనుసమన్విత అన్న నామంలో ఉన్నాయి . చతురంత కరణ ప్రవుత్తి అనే చైతన్యము ఇవన్నీ మనలోని క్రియాశక్తి నిదర్శనములు. ధర్మ అర్ధ కామ మోక్ష ఈ నాలుగూ అమ్మవారి యుక్క లీలావిలాసములు విస్తరింపచేయు శక్తులు . ధర్మ అర్ధ కామ మొక్షాదులను తన నాలుగు బహులుగా చేసుకొని సృష్టి ని నడిపిస్తున్న తల్లి కి నమస్కారము 🙏 🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనం🌺* మనలో జనించిన ఙ్ఞానమనే సూర్యకాంతులు నాలుగుదిక్కులకు ప్రసరించి , మనని మనం రక్షించుకోడానికి , కోరుకున్నవి పొందడానికి మనలో సమర్థతను పెంచుకోడానికి , ఈ ధర్మ అర్ధ కామ మోక్షాలు వల్ల సంపాదించుకోగలుగుతాము . |