ఇందులో గుప్తనామాలు : *
*ఆఢ్య :** శక్తియందు కానీ తేజాస్సుయందు కానీ ఆమె కన్నా సమానముకాని, అధికముకాని ఎవ్వరు లేరు. ఆమె నుండియే సమస్త సృష్టికి శక్తి సంక్రమించింది కాబట్టి ఆమె సర్వ సంయుత . కాబట్టి ఆఢ్య సర్వ సమృద్ధియు ఆమెనుండే ఇతరులకు సంక్రమించును .
*2. పాశాఢ్యా* :సంగము చేత , మమకారము చేత అహంత ఇదంత ,మమత ,లక్షణంచేత ఒక జీవికి మరొక జీవి బంధమైవుంటుంది . అట్టి బంధమే మాయా బంధము. ఆ బంధములో జీవులను కట్టిపడవేసి తన లీలావిలాస ములును నేర్పరితనముతో చేసుకుంటూ వెళ్లే పరాశక్తి పాశాఢ్యా .పాశముతో సర్వ సమృద్ధమైన శక్తియుక్తురాలైనది .
3. *రుపాడ్య :*
:ఆస్థి , ప్రియం , భాతి నామ రూప అన్న పంచ భ్రమ కళల్లో నామ రూపాత్మక జగత్తును సృష్టించడానికి తాను రక్త బిందువై పరమేశ్వరుని ప్రతిపలనాన్ని తనలో వుంచుకున్న కారణంచేత , అది కామేశ్వరరూప పరమాత్మా అయిన కారణంచేత అది శివశక్తిబిందువై శుక్లారక్త సమ్మిశ్రీతమై వుండటంచేత రూపము అనేదానియుక్క మూలకారణం పుట్టింది .ఆ రక్త బిందువు శుక్ల బిందువు తో సమ్మిళితమైన లక్షణం చేత రుపాడ్య అని చెప్పవలసి వుంటుంది .
4. *రాగరూప :మాయయుక్క* లక్షణమేమంటే ఏది నశ్వరమో అది శాశ్వతంమని , ఏది అనశ్వరమో అది మనకు పనికిరానిది అని భావించు కున్న భ్రమ . దానితో మానవులకు సంగము ఏర్పడుతుంది .అనగా సంబంధం ఏర్పడుతుంది . రాగము అన్నది మాయా లక్షణం అని వివేకం వచ్చిన పిమ్మట మాత్రామే తెలుస్తుంది కానీ తత్కాలమందు అదియే జ్ఞ్యానముగా మానవుడు జీవిస్తాడు . ఆ రీతిగా మానవునికి బ్రహ్మ భావన కలుగ కుండా , చాలా వరకు లౌకిక ప్రవుత్తిలోనే వుంచే చాతుర్యము కాబట్టి ఆమె రాగారుపగా తన లీలావిలాసాలను నేర్పుకుంటుంది .
5. *ర అగ* : అంటే చిదగ్ని , కాంతి వృక్షము . ఆ తల్లి కాంతి వృక్షము కాబట్టి అందులోని ఫలములే ఈ సృష్టియందున్న 84 లక్షల జీవరాసులు , జడ చైతన్య రూపములు .నామ రూపాత్మక జగత్తంతా ఆ చిదగ్నికుండములోనుండే సముద్భుత మయింది .
6. *స్వ పాశాఢ్య* : అమ్మవారి ఇచ్చ కు తిరుగులేదు , ఎదురులేదు .అట్టి అమ్మవారి ఇచ్చ ప్రపంచ సృష్టి , దాను స్థితి , లయము , తిరోధానము , వమనము అన్న పంచ కృత్యములను ఈ మాయాపాశమును వేసి నడుపుకుంటుంది .కాబట్టి బంధన వేసే పాశము కంటే బలమైన మాయాపాశము సృష్టి లో మరియుకటి లేదు కాబట్టి స్వపాశాఢ్య అయినది .
7. *స్వపారుపా* :స్వప్నమునందు ఆ తల్లి త్రిగ్రూప కాంతిగా , స్వప్నముగా కనిపిస్తుంది . అపుడు జీవుని తేజసుడు అంటారు. జాగ్రదవస్థలో జీవునియుక్క అభిమానాన్ని విశ్వ అని స్వపంవస్థలో తేజసుడు అను జీవుని అంటారు .సుఘప్తి అవస్థలో అతనిని ప్రాజ్ఞుడు అంటారు .ఇక్కడ స్వరూపా తానే , జాగ్రదవస్దలో విశ్వరూప జీవాచాపల్య దేహాభి మానము ఆమె . అంటే స్థూల , సూక్ష్మ కారణ శరీరములయందు జీవి జీవరూపంలో అభిమానాన్ని ప్రకటించుకునే లక్షణం ఏదో అది అంతరమాయా అనగా లోపలి మాయ. . ఆ లోపలి మాయాస్వరూపమే ఈ స్వపరిపా . జాగృత్ రూప స్వా పారూప సుఘప్తిరూప - ఈ మూడూ కలిపితే త్రిపురసుందరి . ఈ మూడూ చైతన్యావస్దలను త్రిపురములు అంటారు . నాల్గువ అవస్దలో ఆమె శ్రీమహాత్రిపురసుందరి అవుతుంది .సమాధి లోకి పూర్తిగా వెళ్లి పోయినపుడు ఆమె లలితా పరాభట్టారికగా మనయందు నిండివుంటుంది .అపుడు అభావ , విభావ , సుభావములన్న భావనగాని , సంకల్పముగాని , మనస్సుగాని , ఏది వుండదు .
8. *స్వరాగ* : అంటే తన కామమును , తన కోర్కెను , తాను సాఫల్యమూ చేసుకోగలిగిన పరాశక్తి .. ఆమెకి ఈ సంకల్పము కలగకపోతే మన మందరం ఎక్కడ నుండి వచ్చాము ?? కాబట్టి స్వరాగ అంటే మాయగా తన శక్తి యుక్కా మహత్యము తనకు తప్ప ఎవ్వరికీ తెలియనంతటి మహితమత్మురాలు ఆ తల్లి .
ఇక ఇహంత , ఇదంత ,మమత అన్న మూడు లక్షణాలే సృష్టిలో రాగహేతువులు . అహంతా అంటే ' నేను ' అన్న స్వార్ధము , ఇదంతా అంటే అంత నామ స్వంతము కావలిఅనుకోవటం .మమతా అంటే నా సంతానము , నా బంధువులు , నా మిత్రులు అన్న భావన .ఈ ముడు భందములచేత , అహం ప్రవృత్తులచేత జీవి అనవసరంగా భాదపడుతూ వుంటాడు .ఇదియే అమ్మవారి మహామాయా స్వరూపం .రాగమే అమ్మవారి మహామాయా స్వరూపం .జీవుల యందు అహం రూపంగాను లేక జీవ సంస్కార రూపంగాను , ఆమె ఎప్పుడు అవ్యక్త మవుతూనే వుంటుంది . ఆ కారణంచేత మనలో ద్వైత ప్రవృతిని వుంటుంది . దానికి స్వజాతీయ , విజాతీయ , స్వపర బేధాలు కల్పించి ఆ ద్వైత ప్రవృత్తిలో మానవులను మాయ బంధితుల్ని చేస్తుంది కాబట్టే ఆమె రాగస్వరూపపాశాఢ్య అయింది . వాటిని అంటిపెట్టుకొని ఉండటమే రాగము . అదే పశు లక్షణం , అదే అసుర లక్షణం , అదే ద్వైత లక్షణం . అది వదిలించుకుంటేనే విరాగము . అపుడు వచ్చే బ్రహ్మానుభూతిని ద్వైతానుభూతి అంటారు.
రాగమే సంగము , అదే ప్రవుత్తి . దాని నుండి ముక్తియే నివృత్తి మార్గము . రాగమే సంగమన్నది భగవత్ గీత లో కూడా చెప్పారు .
.".సంగాత్ సజాయతే కామ కామత్ క్రుదోభిజాయతే , క్రోధాత్ బవతీసమోహ్మహ: సమ్మెహత్ శృతివిభ్రమ : స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో , బుద్ధినాశాత్ ప్రణశ్యతి '" అన్నారు ..
రాగము జన్మకే కాదు పునర్జన్మకు కూడా కారణమౌతుంది ..రాగానే అరిషట్వర్గాలను పుట్టిస్తుంది
అందు మసలటమే అవిద్యా .
అంటే కామ జనని ,క్రోధ, లోభ ,మౌహ జనని ,మద జనని ,మాత్సర్య జనని, దర్ప జనని ,దంభ జనని అభిమాన ఇద్యాది లక్షణాలు అవిద్యా లక్షణములు .అవన్నీ కలిపితే రాగము జనని అవిద్యా .
అందుకే లలిత పరమేశ్వరి విద్య అవిద్య స్వరూపిణి . అంటే మహామాయగా అవిద్య స్వరూపిణి, ...
బ్రహ్మాణిగా విద్య స్వరూపిణి . రెండు తానే .
బ్రహ్మము తానే మాయాయు తానే .
ఆమె కరుణకై ప్రార్ధిస్తే చివరకు లయం కలుగుతుంది . లేక పోతే ..
' పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం '
🌺 *ఈ నామం వల్ల మనలో కలిగే* *మానసిక పరివర్తనం🌺*
అనురాగము అనేది స్రుతి మించి మనం పొరపాట్లు చేయకుండా , మానని మనము నియంత్రించుకోగల వివేకం పొందుతాము .🙏
|